Sourav Ganguly : ప్రపంచ క్రికెట్ లో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ – ఐపీఎల్ కు ఉన్నంత డిమాండ్ ఇంకే లీగ్ కు లేదంటే నమ్మలేం. ఈ ఒక్క రిచ్ లీగ్ తో బీసీసీఐకి పంట పండుతోంది. కాసుల వర్షం కురుస్తోంది.
ఇప్పటి దాకా పురుషుల వరకే ఉన్న ఐపీఎల్ ను మహిళల కోసం కూడా చేపట్టాలని నిర్ణయించింది బీసీసీఐ. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేసే పనిలో పడింది.
ఈ విషయాన్ని సూత్ర ప్రాయంగా వెల్లడించాడు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). సాధ్యమైనంత త్వరలోనే దీనికి ముహూర్తం పెట్టే యోచనలో ఉన్నాడు.
ఒక్కసారి దాదా డిసైడ్ అయ్యాడంటే ఇంక ఆపడం ఎవరి తరమూ కాదు. ఆ విషయం జే షాకే కాదు భారత జట్టు క్రికెట్ ఆటగాళ్లకు తెలుసు. గంగూలీని బెంగాల్ టైటర్ అని కూడా పిలుస్తారు.
అతడు వచ్చాక బీసీసీఐ పని తీరు మారి పోయింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది లో కానీ లేదా వచ్చే సంవత్సరం తప్పనిసరిగా విమెన్స్ ఐపీల్ చేపట్టాలని డిసైడ్ అయ్యాడు దాదా.
ఇప్పటికే బీసీసీఐ సర్వ సభ్య సమావేశంలో విమెన్ ఐపీఎల్ నిర్వహణ గురించి చర్చించడం జరిగిందన్నాడు. వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశాడు సౌరవ్ గంగూలీ.
పురుషులకు ధీటుగా ఈ లీగ్ ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలు నమోదు చేస్తూ వస్తోంది. 2017లో ప్రపంచ కప్ రన్నరప్ గా నిలిచింది.
2020 టీ20లో ఆసిస్ తర్వాత రెండో అత్యుత్తమ ప్లేస్ దక్కించుకుంది. ఇప్పటి దాకా మూడు జట్లతోనే నిర్వహిస్తోంది. కరోనా కారణంగా ఇది కూడా రద్దు చేశారు.
భారత దేశంలో మహిళా క్రీడాకారులు 1100 మంది ఉన్నారని ఇంకా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు.
Also Read : వెయ్యో వన్డేలో టీమిండియా విక్టరీ