Chiranjeevi Mahesh : ముగిసిన స‌మావేశం టాలీవుడ్ సంతోషం

రాబోయే రోజుల్లో అంతా మంచే జ‌రుగుతుంది

Chiranjeevi Mahesh : టాలీవుడ్ కు చెందిన చిరంజీవి టీం ఏపీ సీఎంతో భేటీ ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు వ‌చ్చాయి. చిరంజీవి (Chiranjeevi Mahesh)నేతృత్వంలోని బృందం జ‌గ‌న్ ను క‌లిసింది.

క‌లిసిన వారిలో చిరంజీవి, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, ఎస్ఎస్ రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, ఆర్. నారాయ‌ణ మూర్తి, ఆలీ, పోసాని కృష్ణ ముర‌ళితో పాటు నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ఉన్నారు.

మంత్రి పేర్ని నాని ఈ భేటీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ రెడ్డితో భేటీ అనంత‌రం మీడియాతో సినీ న‌టులు, ద‌ర్శ‌కులు మాట్లాడారు. అంత‌కు ముందు మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఎవ‌రు ఏది మాట్లాడినా చిరంజీవి ప‌ట్టించు కోలేద‌న్నారు.

సినీ రంగం బాగుండాల‌ని త‌పించార‌ని పేర్కొన్నారు. ఇవాల్టి భేటీకి కూడా కార‌ణం ఆయ‌నేన‌ని చెప్పారు. సినీ రంగం అభివృద్ధికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని సీఎం చెప్పార‌ని తెలిపారు చిరంజీవి(Chiranjeevi Mahesh). అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చార‌న్నారు.

చిన్న సినిమాలు బ‌తికేలా చేస్తామ‌ని కూడా తెలిపార‌న్నారు. త్వ‌ర‌లో అన్ని ఇబ్బందులు తొలగి పోతాయ‌ని న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. నంది పుర‌స్కారాలు మ‌ళ్లీ ఇచ్చేలా ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఒప్పించాల‌ని ద‌ర్శ‌కుడు ఆర్. నారాయ‌ణ మూర్తి కోరారు.

ప్ర‌య‌త్నం చేసిన చిరంజీవి, పేర్ని నానిని అభినందించారు. చాలా సేపు త‌మ స‌మ‌స్య‌ల‌ను విన‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌భాస్. టాలీవుడ్ పై పూర్తిగా అవ‌గాహ‌న జ‌గ‌న్ కు ఉంద‌న్నారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.

చ‌ర్చ‌ల‌కు ప్ర‌త్యేక చొర‌వ చూపిన చిరంజీవికి థ్యాంక్స్ చెప్పారు మ‌హేష్ బాబు. ఈనెల మూడో వారంలో కొత్త జీవో విడుద‌ల అవుతుంద‌న్నారు చిరంజీవి.

చిన్న సినిమాల కోసం ఐదో షో కు కూడా ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంపై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శుభం కార్డు ప‌డింద‌న్నారు.

Also Read : ‘మ‌హేష్..కీర్తి’ పోస్ట‌ర్ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!