YS Jagan : ఏం కావాల‌న్నా ఇస్తాన‌న్న జ‌గ‌న‌న్న‌

ఏపీని సినిమా హ‌బ్ గా మార్చండి

YS Jagan : ఏపీ సీం జ‌గ‌న్ రెడ్డి ఊహించ‌ని రీతిలో తీపి క‌బురు చెప్పారు. సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి త‌న‌తో భేటీ అయ్యారు టాలీవుడ్ ప్ర‌ముఖులు.

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో మ‌హేష్ బాబు, ప్ర‌భాస్ , ఆలీ, పోసాని కృష్ణ ముర‌ళితో పాటు ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌,

ఆర్. నారాయ‌ణ మూర్తి, ఎస్ఎస్ రాజ‌మౌళి, నిర్మాత నిరంజ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

స‌మాచార, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి పేర్ని నాని వారు లేవ‌నెత్తిన అంశాలు, స‌మ‌స్య‌ల‌ను సీఎంకు(YS Jagan) విన్న‌వించారు.

ఈ సంద‌ర్భంగా వారు కోరిన కోరిక‌ల‌కు అన్నింటినీ తీర్చుతానంటూ స్ప‌ష్టం చేశాడు.

అంతే కాదు వారికి బంప‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చాడు జ‌గ‌న్ రెడ్డి. విశాఖ‌తో పాటు ఏపీని సినిమా హ‌బ్ గా మార్చాల‌ని కోరాడు.

ఏం కావాలో కోర‌కోండి ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

అంద‌రికీ న్యాయం జ‌రిగేలా టికెట్ల ధ‌ర‌లకు ఓకే చెప్పాడు. ఏపీలో సినిమా ప‌రిశ్ర‌మ పాదుకునేలా ప్రోత్సాహ‌కాలు ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

సినిమా రంగానికి సంబంధించి స్టూడియోల‌తో పాటు ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌న్నరు సీఎం. ఇంత‌కంటే గొప్ప పాల‌సీని తీసుకు రావాల‌నే ఉద్దేశంతో క‌మిటీని ఏర్పాటు చేశామ‌న్నారు.

అందుకనే మిమ్మ‌ల్ని ర‌మ్మ‌ని పిలిచాన‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి. ఏ సినిమా కైనా ఎవ‌రి మూవీకైనా ఒకే ధ‌ర ఉండాల‌న్న‌ది నా పాల‌సీ అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో షూటింగ్ లు ప్ర‌మోట్ చేసేలా కృషి చేయాల‌న్నారు.

ఏడాదికి వేయి రూపాయ‌ల‌తో ఏడాది అంతా చూసేందుకు ఫ్రీగా ఇస్తోంది అమెజాన్. ఇక నెల‌కు రూ. 80 ప‌డుతుంద‌న్నారు.

సినీ ప‌రిశ్ర‌మ విశాఖ‌ప‌ట్నంకు రావాల‌ని కోరారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan). సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆదాయం ఏపీ నుంచి 60 శాతం ఉంటే తెలంగాణ నుంచి 40 శాతం ఉంటోంద‌న్నారు.

స్థ‌లాలు ఇస్తాం. స్టూడియోలు క‌డితే ఓకే అన్నారు. జూబ్లీ హిల్స్ త‌ర‌హాలో ఓ ప్రాంతాన్ని క్రియేట్ చేయాల‌న్నారు. వైజాగ్ చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ తో పోటీ ప‌డాల‌న్న‌ది త‌న కాన్సెప్ట్ అన్నారు.

Also Read : ‘మ‌హేష్..కీర్తి’ పోస్ట‌ర్ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!