India W ODI Series : వరల్డ్ టాప్ మహిళా క్రికెటర్లలో ఉన్న హైదరాబాదీ స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళా జట్టు న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ ఆడనుంది. ఇప్పటికే ఒకే ఒక టీ20 మ్యాచ్ కోల్పోయింది.
వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న ఈ సీరీస్ టీమిండియాకు అత్యంత ముఖ్యం కానుంది. ప్రాక్టీస్ కాక పోయినా జట్టు మరింత బలోపేతం కావడానికి ఇది ఉపయోగ పడనుంది.
ఈనెల 12న న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అర్థరాత్రి స్టార్ట్ అయ్యే ఈ మ్యాచ్ ను అమెజాన్ ప్రైమ్ టెలికాస్ట్ చేస్తుంది. విచిత్రం ఏమిటంటే ఈ మ్యాచ్ ఇవాళే ప్రారంభం కావాల్సి ఉంది.
కరోనా ప్రభావం కారణంగా ఒక రోజు ఆలస్యంగా షెడ్యూల్ లో మార్పు చేశారు. క్వీన్స్ టౌన్ లోనే అన్ని మ్యాచ్ లు జరగనున్నాయి. 14న జరగాల్సిన రెండో వన్డే 15న జరగనుంది. మూడో వన్డే 16న కాకుండా 18న కొనసాగుతుంది.
22న , 24న జరిగే మ్యాచ్ లలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు రెండు క్రికెట్ బోర్డులు. ఈ వన్డే సీరీస్ ను మూడు వేదికలపై ఆడాల్సి ఉంది. కరోనాను దృష్టిలో ఉంచుకుని మొత్తం వన్డే సీరీస్(India W ODI Series) ను క్వీన్స్ టౌన్ కు తరలించింది.
ఇక ఇప్పటికే మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత జట్టు గత నెల జనవరి 24న ముంబై నుంచి న్యూజిలాండ్ కు బయలు దేరి వెళ్లింది. క్రైస్ట్ చర్చ్ లోని ఐసోలేషన్ లో ఉంది.
సీరీస్ ముగిశాక మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 దాకా జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ కు ఇరు జట్లు వెళతాయి.
Also Read : క్లీన్ స్విప్ చేస్తారా చేతులెత్తేస్తారా