Chinnajeeyar Swamy : స‌మ‌తా స్పూర్తి చిన్నజీయ‌ర్ దిక్సూచి

స్వామి స‌న్నిధి భ‌క్తుల‌కు పెన్నిధి ఆధ్యాత్మిక‌త‌కు వార‌ధి

Chinnajeeyar Swamy : యావ‌త్ భార‌త‌మంతా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వైపు చూస్తోంది. ఒక వ్య‌క్తి ఇంత‌లా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌డా అన్న దానిపై ఆలోచిస్తోంది. ఇది స‌త్ సంక‌ల్పం. ధ‌ర్మ మార్గం. నిత్యం భ‌క్తితో అనుసంధానం కావ‌డం దిశా నిర్దేశం చేసేలా చేస్తోంది.

ఈ దేశంలో ఎంద‌రో మ‌హానుభావులు జ‌న్మించారు. త‌మ‌దైన ముద్ర‌తో ఆక‌ట్టుకున్నారు. పండితులు, స్వాములు, పీఠాధిప‌తులు, రుషులు, సంఘ సంస్క‌ర‌లు, ఆధ్మాత్మిక‌వేత్త‌లు ఉన్నారు.

1017 ఏళ్ల కింద‌ట ఈ పవిత్ర భూమిపై న‌డ‌యాడిన శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యులు సాంఘిక సంస్క‌ర్త‌గా

, ఆధ్యాత్మిక విప్ల‌వ‌కారుడిగా గుర్తించింది మాత్రం శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy) అని చెప్ప‌క త‌ప్ప‌దు.

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న జీయ‌ర్ స్వామీజీ ఒక భార‌తీయ పాండిత్య వేద పండితుడు.

త‌న వివిధ ఉప‌న్యాసాలు, ప్ర‌ప‌చ‌నాల‌తో జాతీయంగా, అంత‌ర్జాతీయంగా ప్ర‌శంస‌లు పొందారు.

ఏ అంశంపైన నైనా అన‌ర్ఘ‌లంగా మాట్లాడే వ‌క్త‌గా పేరొందారు.

ఉప‌న్యాసాలు చాలో లోత‌నైవి. అన్నింటిని జీవితంలో జ‌రిగే ప్ర‌తి ఒక్క అంశాన్ని స్పృశించేలా ఉండేలా బోధిస్తారు.

సాధార‌ణ మాన‌వుల‌కు సైతం అర్థం అయ్యేలా వివ‌రిస్తారు. వేద సూత్రాల‌ను విశ‌దీక‌రించి భ‌క్తి వైపు మ‌ళ్లేలా చేస్తారు చిన్న జీయ‌ర్ స్వామి

. సంక్లిష్ట‌మైన అంశాల సారాంశాన్ని వెండి పళ్లెంలో అంద‌జేస్తారు.

బ‌తుకు మ‌ర్మం తెలియ‌ని వారికి, అత్యంత క్లిష్ట‌మైన దారుల్ని, అడ్డంకుల్ని దాటేందుకు దారి చూపిస్తారు శ్రీ‌శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy).

భాష‌లోని స‌ర‌ళ‌త‌కు లొంగ‌ని , ప‌ర‌వ‌శించ‌ని వ్య‌క్తులంటూ ఎవ‌రూ లేరు ఈ లోకంలో.

స్వామి ఓ త‌త్వ‌వేత్త‌. అస‌మాన్య‌మైన ఆధ్యాత్మిక గురువు. మాన‌వాళికి నిస్వార్థ సేవ చేసే సాధ‌కుడు.

శాంతికి రాయ‌బారి. స‌మాన‌త‌కు దిక్సూచి. ప్ర‌పంచ మాన‌వాళికి సంక్షేమ‌, మాన‌వాతను చాటే ప్రాజెక్టుల‌పై విస్తృతంగా ప‌ని చేస్తున్నారు

. గ‌త 36 సంవ‌త్స‌రాలుగా ఆధ్యాత్మిక భావ జ‌ల‌ధార‌ను పంచుతున్నారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి.

ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది యువ‌త‌కు సేవా క‌ళ‌ను నేర్చుకునేలా స్పూర్తి క‌లిగిస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణానికి అనుగుణంగా జీవించేలా స‌మాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

త‌న జీవిత కాలం విద్య‌,క్రీడలు, ఆరోగ్య సంర‌క్ష‌ణ, మ‌హిళా సాధికార‌త వంటి వివిధ మార్గాల‌లో ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఎంచుకున్నారు.

గిరిజ‌నుల కోసం పాఠ‌శాల‌లు, మ‌హిళల కోసం ఆరోగ్య సంక్ష‌ర‌ణ కార్య‌క్ర‌మాలు, దృష్టి లోపం ఉన్న వారికి విద్యా కార్య‌క్ర‌మాలు, ఖైదీల‌లో మార్పు తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

టెక్నాల‌జీ పెర‌గడాన్ని గుర్తిస్తూనే పిల్ల‌ల్లో నైతిక విలువ‌ల్ని పెంపొందించే ప‌నిలో నిమ‌గ్నం అయ్యారు.

మాన‌వాళికి అత్యంత ప్రేమ‌ను కురిపిస్తూ ఆద‌ర్శ ప్రాయ‌మైన ఆచార్యుడైన శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపే

అవ‌కాశాన్ని శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy) స్వీక‌రిస్తూ బాధ్య‌త‌ల‌ను మోస్తున్నారు.

ఆ మ‌హానుభావుడు అందించిన స్పూర్తిని మ‌నంద‌రికీ అందేలా చేస్తున్నారు. స్వామి వారిలోని మాన‌వ‌తా స్వ‌భావం ప్ర‌పంచమంతా వ్యాపించేలా చేసింది. ఎంద‌రికో సాంత్వ‌న‌ను క‌ల‌గ చేస్తున్నాయి.

చిన్న జీయ‌ర్ స్వామి వారు అందించే తీర్థం, మంగ‌ళా శాస‌నాలు అత్యంత ప‌విత్ర‌మైన‌వి.

ఇవ‌న్నీ వేదాలు, వైదిక ఆచారాల గురించిన లోతైన జ్ఞానంతో పొందు ప‌ర్చిన , స్థాపించ బ‌డిన వంశం ద్వారా లోతైన మూలాల ఫ‌లితం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌తి మ‌తానికి దాని స్వంత ఆచారాలు ఉన్నాయి. ఒక ద‌ర్శానికుడి ఆత్మ క‌ర్మ‌లో తీవ్రంగా నిమ‌గ్న‌మైన‌ప్పుడు అది ఆధ్యాత్మిక ఆచారం అవుతుంది. వ్య‌క్తిగ‌త మ‌తాలకు సంబంధించిన అన్ని అడ్డంకుల‌ను తొల‌గించేలా చేస్తుంది..

అన్ని జీవుల ఏక‌త్వమ‌నే దానికి చేరుకుంటుంది. ఈ ఘ‌న‌త అంతా శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామికే(Chinnajeeyar Swamy) ద‌క్కుతుంది. ఈ లోకంలో శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దాయపు జ్యోతిని మోస్తున్నాడు.

స్వామి కాంతి, తేజ‌స్సు కుల‌, మత‌, జాతీయ‌త అన్ని అడ్డంకుల‌ను దాటి చొచ్చుకు పోయింది. ఇదే స‌మ‌యంలో విప్ల‌వాత్మ‌క సంఘ సంస్క‌ర్త‌గా పేరొందిన రామానుజాచ‌ర్య స‌మాన‌త్వ భావ‌న‌ను ప్ర‌చారం చేశారు.

ఆ బోధ‌న‌ల ద్వారా ల‌క్ష‌లాది మంది ప్ర‌భావితం అవుతూనే ఉన్నారు. వెయ్యేళ్ల త‌ర్వాత రామానుజుడి గొప్ప‌త‌నాన్ని ఈ ప్ర‌పంచానికి ఎక్కువ‌గా అర్థ‌మ‌య్యేలా చేయ‌డంలో శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి ముందంజ‌లో ఉన్నారు.

స్వామి త‌న ఆధ్యాత్మిక ప్ర‌యాణంలో ఈ స‌మాజం సమాన‌త్వం అనే భావ‌న‌ను పూర్తిగా మ‌రిచి పోయింద‌న్న వాస్త‌వాన్ని గుర్తించారు. స్వామిని క‌దిలించింది.

రామానుజాచార్యులు స‌మాన‌త్వం కోసం చేసిన అవిశ్రాంత ప్ర‌య‌త్నాల‌ను విస్మ‌ర‌ణ అంధ‌కారంలో వదిలి పెట్ట‌లేక పోయారు.

ప్ర‌పంచంలో స‌మాన‌త్వం అనే భావ‌న‌ను పున‌రుద్ద‌రించేందుకు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి సంక‌ల్పించారు.

ఆనాటి నుంచి నేటి దాకా ఆ ప్ర‌య‌త్నం దేదీప్య‌మానంగా వెలుగొందుతోంది. అదే 216 భారీ అడుగుల స‌మ‌తామూర్తిగా రూపు దాల్చింది. కొన్నేళ్ల అవిశ్రాంతంగా కృషి చేసిన ఫ‌లితానికి తార్కాణంగా నిలిచింది.

భ‌గ‌వంతుని దృష్టిలో అంద‌రికీ స‌మాన‌త్వాన్ని సూచించే అద్భుత‌మైన స్మార‌క చిహ్నం ద్వారా భ‌విష్య‌త్ త‌రాలు ఆచార్యుల వంశ ఫ‌లాలు పొందుతాయి.

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి త‌న‌ను తాను మ‌నంద‌రిలో ఒక‌రిగా భావించుకున్న‌ప్ప‌టికీ త‌ను ముందుకు న‌డ‌వ‌డం ద్వారా , అన్ని అడ్డంకుల‌ను తొల‌గించ‌డం, బాధ‌ల‌ను భ‌రించ‌డం ద్వారా మ‌న ఆనందానికి దారులు ప‌రుస్తున్నాడ‌ని పూర్తిగా స్ప‌ష్టం అవుతుంది.

ఈ అద్భుత‌మైన భ‌గ‌వ‌ద్ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకోవ‌డం ద్వారా సేవ చేసే భాగ్యాన్ని శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారు క‌ల్పిస్తున్నారు.

ఏదైనా ఉప‌కారం కోసం పెద్ద లేదా చిన్న మీరు మాట‌ల  ద్వారా లేదా చ‌ర్య‌ల ద్వారా ధ‌న్య‌వాదాలు చెప్పండి.

అంతిమ ర‌క్ష‌కుడైన భ‌గ‌వంతుడి ముందు మ‌నంద‌రి స‌మాన‌త్వం కోసం పోరాడిన శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజుల ప్రేమ‌ను ఊహించుకోండి.

మ‌నం ఎంత  కృత‌జ్ఞులమై ఉండాలి. శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి ఈ ప్ర‌శ్న‌ను స్వ‌యంగా అడుగుతారు. అంతే  కాదు మ‌న‌లో మ‌నం వేసుకోమ‌ని సూచిస్తారు.

ఆ గొప్ప ఆచార్యుడిగా ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తూ మార్గాన్ని ఏర్పాటు చేశారు. స‌మ‌తామూర్తి అందించిన స్పూర్తిని కొన‌సాగిద్దాం.

భ‌గ‌వ‌ద్ స్వ‌రూపుడైన శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారి కృప‌కు పాత్రుల‌మ‌వుదాం. జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌.

Also Read : క‌త్తులు దూస్తున్న కారు..క‌మ‌లం

Leave A Reply

Your Email Id will not be published!