IPL 2022 Auction : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఐపీఎల్ (IPL 2022 Auction)మెగా వేలం బెంగళూరు వేదికగా ప్రారంభమైంది. కీవీస్ స్టార్ బౌలర్ బౌల్ట్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా అతడిని దక్కించు కునేందుకు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.
చివరకు ఆర్ఆర్ ఏకంగా రూ. 8 కోట్లకు చేజిక్కించుకుంది. ఇక గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన సౌతాఫ్రికాకు చెందిన రబాడా కోసం భారీ పోటీ నెలకొంది.
చివరకు గుజరాత్ టైటాన్స్ బరిలో ఉన్నా పంజాబ్ కింగ్స్ రూ. 9.25 కోట్లతో రబాడాను చేజిక్కించుకుంది. ఇక ఆసిస్ స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ మూడో ప్లేయర్ గా వేలంకు రాగా ఈసారి రూ. 7.25 కోట్లతో కేకీఆర్ తిరిగి కొనుగోలు చేసింది.
ఇదే సమయంలో రెండో ప్లేయర్ గా వేలంలోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ రూ. 2 కోట్ల కనీస ధరకు వచ్చాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. చివరకు. రాజస్థాన్ రాయల్స్ రూ. 5 కోట్లకు దక్కించుకుంది.
ఇక వేలం పాటలో మొట్ట మొదటి ప్లేయర్ గా శిఖర్ ధావన్(IPL 2022 Auction) వచ్చాడు. అతడిని తీసుకోవడం కోసం పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొన్నప్పటికీ చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 8.25 కోట్లతో పంజాబ్ కింగ్స్ తీసుకుంది.
ఇక వేలం పాటలో ఆయా ఫ్రాంచైజీల జేబుల్లో ఎంత ఉందనే విషయం పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 47.5 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 48 కోట్లు, ఆర్సీబీ వద్ద రూ. 57 కోట్లు , కేకేఆర్ వద్ద రూ. 48 కోట్లు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ వద్ద రూ. 48 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ. 62 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 68 కోట్లు ఉన్నాయి.
Also Read : 12న కీవీస్ భారత్ వన్డే మ్యాచ్