David Warner IPL : ఐపీఎల్ వేలం 2022 లో భారీ ధర పలుకుతాడని భావించిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (David Warner IPL)కు కోలుకోలేని షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించడమే కాకుండా దానికి నాయకత్వం కూడా వహించాడు.
ఐపీఎల్ 2021లో తీవ్ర నిరాశ పర్చాడు. దీంతో సదరు ఫ్రాంచైజీ మేనేజ్ మెంట్ అతడిని పూర్తిగా పక్కన పెట్టింది. చివరకు వదిలేసుకుంది కూడా. ఆ జట్టుకు ఏకంగా ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపాడు.
కానీ ఎందుకనో పూర్ ఫార్మెన్స్ పేరుతో పక్కన పెట్టారు. దీంతో ఈసారి వేలం పాటలోకి వచ్చాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సెకండ్ సీజన్ లో విఫలమైనా టీ20 వరల్డ్ కప్ లో రాణించాడు.
ఆసిస్ లో జరిగిన టెస్ట్ సీరీస్ లో సత్తా చాటాడు. భారీ ధరకు పోతాడని అనుకున్నారు అభిమానులు. వేలం పాట ప్రారంభమయ్యాక అన్నీ తలకిందులు అయ్యాయి.
అంచనాలు తలకిందులు చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్ల నామ మాత్రపు ధరే అమ్ముడు పోవడం ఆశ్చర్యం కలిగించింది. వార్నర్(David Warner IPL) కోసం ఆర్సీబీ కన్నేస్తుందని అనుకున్నారు.
కానీ అతడి వైపు కన్నెత్తి చూడలేదు. ముంబై ఇండియన్స్ తీసుకోవాలని అనుకుంది. కానీ ఆఖరు నిమిషంలో విరమించుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ ను చేజిక్కించుకుంది.
గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున డేవిడ్ వార్నర్ ప్రాతినిధ్యం వహించాడు. ఈసారి ఢిల్లీ తరపున ఎలా ఆడుతాడు అన్నది ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
Also Read : రూ. 5 కోట్లు పలికిన రవిచంద్రన్ అశ్విన్