Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్ రావును ఆకాశానికి ఎత్తేశారు. ఇవాళ హైదరాబాద్ ముచ్చింతల్ లోని శ్రీరామనగరంకు చేరుకున్నారు. అనంతరం సమతాకేంద్రంలోని సమతామూర్తిని దర్శించుకున్నారు.
చిరంజీవితో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు చిరంజీవి(Chiranjeevi). ఇంత భారీ విగ్రహాన్ని నిర్మించడం మామూలు విషయం కాదన్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులతో జూపల్లి రామేశ్వర్ రావు దీనిని నిర్మించారంటూ కితాబు ఇచ్చారు.
రాబోయే తరాలు ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారని కొనియాడారు చిరంజీవి. ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయమన్నారు.
వెయ్యేళ్ల కిందట శ్రీ రామానుజాచార్యులు చూపిన మార్గం పది తరాలకు అందించాలనే సదుద్దేశంతో ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేయడం మంచిదన్నారు.
ఇక ఇది పవిత్రమైన పుణ్య క్షేత్రంగా ఇక నుంచి భాసిల్లుతుందని ఆకాక్షించారు. ఇదే సమయంలో ఆయన మరో కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన విగ్రహంగా ఇది నిలుస్తుందన్నారు.
చైనా వాళ్లు బుద్దుడి విగ్రహాన్ని నిర్మించారని దీనిని కూడా అదే స్థాయిలో నిర్మించడం బాగుందన్నారు. అనంతరం చిన్న జీయర్ స్వామి పాల్గొన్న వారందరికీ మంగళా శాసనాలు అందజేశారు. సన్మానించి రామానుజుడి ప్రతిమలను అందజేశారు.
అంతకు ముందు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పూర్తి దాయకమైన ప్రసంగం చేశారు. సమతామూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో సేవ చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : సమతామూర్తి మహా అద్భుతం