Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్(Gavaskar) సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం బెంగళష్ట్రరు వేదికగా పూర్తయిన 2022 ఐపీఎల్ మెగా వేలంలో చిన్న ప్లేయర్లకు భారీ ఎత్తున డబ్బులు చెల్లించడాన్ని తప్పు పట్టాడు.
అన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇంత పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి వేలంలో కొనుగోలు చేయడం మంచి పద్దతి కాదన్నాడు.
ఇప్పుడిప్పుడే ఆటలో నిలదొక్కుకుంటున్న సమయంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తే వారికి డబ్బులపై ఫోకస్ ఉంటుందే తప్పా ఆటపై ఉండదని కుండ బద్దలు కొట్టాడు గవాస్కర్ .
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ కమ్ముకుని ఉంది. ఊహించని రీతిలో గతంలో ఐపీఎల్ లో ఆడిన స్టార్ ప్లేయర్లకు షాక్ ఇచ్చారు ఈసారి ఫ్రాంచైజీలు. అనామకులు ఒక్క రోజులోనే హీరోలు గా మారి పోయారు.
అండర్ -19 టీమ్ స్కిప్పర్ యశ్ ధుల్ ను రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఇక హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ ఎవరూ ఊహించని ధరకు దక్కించుకుంది.
ఏకంగా అతడిని రూ. 1.75 కోట్లకు తీసుకుంది. విచిత్రం ఏమిటంటే భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో విజయాలు అందించిన రహానే కేవలం రూ. కోటికి అమ్ముడు పోయాడు. అతడిని కేకేఆర్ తీసుకుంది.
ఈ తరుణంలో యువ ఆటగాళ్లు ప్రతిభ కలిగి ఉన్నారని , వారిని కోట్లకు కొనుగోలు చేయడం వల్ల వారి కుటుంబాలు ఆనందంగా ఉండడం తప్పు లేదన్నాడు సన్నీ.
కానీ ఆటపై దృష్టి పోతుందన్నారు. చిన్న ప్లేయర్లపై వేలం ధర గరిష్టంగా రూ. 1 కోటి ఉంటే బెటర్ అని సూచించాడు.
Also Read : రూ. 8 కోట్లు పలికిన జోఫ్రా ఆర్చర్