KCR : కేసీఆర్ టార్చ్ బేర‌ర్

ఉద్య‌మ నాయ‌కుడు కార్య సాధ‌కుడు

KCR Birth Day :కేసీఆర్ ఈ మూడు అక్ష‌రాల గురించి ప‌రిచేయాల్సిన ప‌ని లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయ‌కుడిగా ఎల్ల‌కాలం నిలిచి పోతారు. భార‌త దేశ చ‌రిత్ర‌లో కేసీఆర్ కు ఓ పేజీ అన్న‌ది ఉండి పోయింది.

చూస్తే బ‌క్క ప‌ల్చ‌గా క‌నిపించే క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు అలియాస్ కేసీఆర్ (KCR Birth Day) ఒక్క‌సారి క‌మిట్ అయితే ఇక అంతు చూడ‌కుండా ఉండ‌రు. బ‌హు భాషా కోవిదుడు.

మాట‌ల‌తో మంట‌లు రేప‌గ‌ల‌డు. దేశ రాజ‌కీయాల‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన చ‌రిత్ర కేసీఆర్ ది.

ఏ అంశమైనా అన‌ర్ఘ‌లంగా మాట్లాడ‌గ‌లిగే నేత‌ల‌లో ఆయ‌న కూడా ఒక‌రు.

ఒక‌ప్పుడు సూదిని జైపాల్ రెడ్డి ఉండేవారు. కానీ కేసీఆర్ పంథా వేరు. ఆయ‌న ఎంచుకున్న దారి వేరు.

ఒక ర‌కంగా మ‌గోడు..ద‌మ్మున్నోడు. ఆయ‌న‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్టం.

కేసీఆర్ మాట్లాడుతుంటే ఎవ‌రైనా గ‌మ్మునుండాల్సిందే. లేక పోతే వారికి స‌రైన రీతిలో స‌మాధానం ఇస్తారు. ఏ భాష‌లోనైనా స‌రే సై అంటారు.

కార్య సాధ‌కుడు, జ‌ల ప్ర‌దాత‌, ఉద్య‌మ నాయ‌కుడు, సాహితీ పిపాస‌కుడు. క‌వి. ర‌చ‌యిత‌.

అనువాద‌కుడు. వ‌క్త‌. అంత‌కు మించి మాట‌ల మాంత్రికుడు కూడా.

తెలంగాణ రాష్ట్రానికి చీఫ్‌. త‌నతో పోటీ ప‌డాలంటే స‌త్తా ఉండాలి. అంత‌కంటే ద‌మ్ముండాలి.

ఇవాళ కేసీఆర్ పుట్టిన రోజు. మెద‌క్ జిల్లా చింత‌మ‌డ‌క‌లో 1954 ఫిబ్ర‌వ‌రి 17న పుట్టారు. ఆయ‌న‌కు ఇప్పుడు 67 ఏళ్లు. కొడుకు కేటీఆర్(KCR Birth Day).

కూతురు క‌విత‌. అల్లుడు హ‌రీష్ రావు. భార్య శోభ‌మ్మ‌. కేసీఆర్ కు మ‌నుమడు హిమాంశు అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం.

తెలంగాణ రాష్ట్రం కోసం ల‌క్ష‌లాది మందిని స‌మీక‌రించిన అరుదైన నాయ‌కుడు.

సంబండ వ‌ర్ణాల‌ను ఏక‌తాటిపైకి న‌డిపించిన లీడ‌ర్. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, డిప్యూటీ స్పీక‌ర్ గా, ఆర్టీసీ చైర్మ‌న్ గా, సీఎంగా ఎన్నో ప‌ద‌వులు నిర్వ‌హించారు.

తెలంగాణ రాష్ట్రం ప్ర‌క‌టించాకే తెలంగాణ గ‌డ్డ‌పై అడుగు పెడ‌తాన‌ని చెప్పి ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించిన అరుదైన నాయ‌కుడు. ఒక ర‌కంగా చెప్పాలంటే కేసీఆర్ టార్చ్ బేర‌ర్.

రెండోసారి కూడా ఆయ‌నే సీఎంగా కొలువు తీరారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మాట‌లు పుట్టించ గ‌ల‌డు. కొత్త ప‌దాల‌తో మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌రు. అంత‌క‌న్నా ప్ర‌త్య‌ర్థులు విస్తు పోయేలా మాట్లాడి విస్తు పోయేలా చేయ‌గ‌ల స‌త్తా కేసీఆర్ ది.

విద్యార్థి ద‌శ నుంచే రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టిన కేసీఆర్ చివ‌ర‌కు దేశం త‌న వైపు చూసేలా త‌న‌ను తాను తీర్చి దిద్దుకున్నారు. కేసీఆర్ చ‌ల్లంగా ఉండాలని కోరుకుందాం.

Also Read : స‌మ‌తా స్పూర్తి చిన్నజీయ‌ర్ దిక్సూచి

Leave A Reply

Your Email Id will not be published!