KTR : ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు లేదా చెన్నై అని చెప్పే వారు. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువు తీరిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో ఉన్న పారిశ్రామిక విధానాలను సమూలంగా మార్పు చేసింది. ఈ మేరకు టీఎస్ ఐఎస్ పాలసీ తీసుకు వచ్చింది. ఈ పాలసీ దేశంలో ఎక్కడా లేదు. ఎవరైనా ఔత్సాహికులు, వ్యాపారవేత్తలు, కంపెనీలు, ఎన్నారైలు ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు.
తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవచ్చు. ప్రభుత్వం బేషరతుగా మద్దతు ఇస్తోంది. అంతే కాదు ఎవరికీ సలాం కొట్టాల్సిన పని లేదు. ఇంకెవరితోనూ పైరవీ చేయాల్సిన పని లేదు.
ఆన్ లైన్ అప్లై చేసుకోవడం ఆ తర్వాత అన్నింటినీ సమర్పించడం నేరుగా ఇన్వెస్ట్ చేయడం, తమ పరిశ్రమను స్థాపించేందుకు రెడీ కావడం. ఇలాంటి సిస్టం ఇంకెక్కడా లేదు.
15 రోజుల లోపు ప్రభుత్వం తరపున పర్మిషన్ రానట్లయితే ఇక ఆ దరఖాస్తుకు పూర్తిగా అనుమతి లభించినట్లే. ఈ ఆలోచన వర్కవుట్ అవుతోంది తెలంగాణ.
ప్రస్తుతం రాష్ట్రం ఐటీ హబ్, ఫార్మా హబ్, అగ్రి హబ్ తో పాటు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మారుతోంది. ఇప్పటికే వందలాది కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి. వేలాది మందికి ఉపాధి కల్పించడంలో ఫోకస్ పెట్టాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పెడితే ప్రైవేట్ ఉద్యోగాలకు కొదువ లేదు. తాజాగా దేశంలోనే పేరొందిన టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ సంస్థ రాష్‌ట్రంలో రూ. 1000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది.
మంత్రి కేటీఆర్ (KTR )తో ఎంఆర్ఎఫ్ వైస్ చైర్మన్, ఎండీ అరుణ్ మమ్మెన్ భేటీ అయ్యారు. సదాశివపేటలో ప్లాంట్ ను విస్తరించనున్నట్లు తెలిపారు.
Also Read : రిషి అగర్వాల్ ను ప్రశ్నించిన సీబీఐ