Chateshwar Pujara : భారత జట్టు స్టార్ ప్లేయర్ గా పేరొందిన ఛతేశ్వర్ పుజారా ఉన్నట్టుండి ఫామ్ లేమితో కొట్టు మిట్టాడుతున్నాడు. ప్రస్తుతం రంజీ వేదికగా సత్తా చాటాలని ఆశించాడు.
ఈ మేరకు ముంబై తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారాChateshwar Pujara) ఎలాంటి పరుగు చేయకుండానే ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు.
శ్రీలంక జట్టుతో జరిగే టెస్టు సీరీస్ లో ఎంపిక కావడం కష్టమేనని అనిపిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.
తాను కూడా ఫామ్ కోల్పోయానని, ఆ సమయంలో తాను మళ్లీ దేశంలో జరిగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లను వేదికగా చేసుకున్నానని చెప్పాడు. పరోక్షంగా ఆడితేనే తీసుకుంటామని లేక పోతే కష్టమని చెప్పకనే చెప్పాడు.
దీంతో మరోసారి స్టార్ ప్లేయర్ అజింక్యా రహానే మాత్రం కష్టాల్లో ఉన్న తమ జట్టును ఆదుకున్నాడు. సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. ఇదే సమయంలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఛతేశ్వర్ పుజారా.
ఇదిలా ఉండగా ముంబై స్టార్ బౌలర్ మోహిత్ అవస్తీ బంతులను ఆడలేక ఇబ్బంది పడ్డాడు. చివరకు పెవిలియన్ బాట పట్టాడు. ఇవాళ రాత్రి లోపు భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ టెస్టు మ్యాచ్ కు సంబంధించి ఫైనల్ జట్టును ప్రకటించనుంది.
ఈ తరుణంలో పుజారా ఉంటాడా ఉండడా అన్నది సందిగ్ధమే. అజింక్యా రహానే పరిస్థితిపై సౌరవ్ గంగూలీ, సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఏం చేస్తారనేది తెలుసు కోవాలంటే వెయిట్ చేయాల్సిందే.
Also Read : అర్జున్ టెండూల్కర్ ఆట చూడను