Gavaskar : భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా ఫ్యూచర్ ఇప్పుడు గందర గోళంలో పడింది. ఇప్పటికే యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.
మరో వైపు మూడు ఫార్మాట్ లు పూర్తిగా మారి పోయాయి. రంజీ ట్రోఫీలో వీరిద్దరూ మరోసారి తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు.
రహానే సెంచరీతో రాణిస్తే పుజారా 91 పరుగులు చేశాడు. కానీ ప్రస్తుతం శ్రీలంకతో జరిగే టెస్టు సీరీస్ కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ వీరిని పూర్తిగా పక్కన పెట్టేసింది. రహానే, పుజారా, వృద్ది మాన్ సాహాతో పాటు ఇషాంత్ శర్మలకు చెక్ పెట్టాడు చైర్మన్ చేతన్ శర్మ.
ఇక మూడు ఫార్మాట్ లకు ఎవరు కెప్టెన్ గా ఉంటారనే దానికి తెర దించాడు. రోహిత్ శర్మకే అప్పగించాడు. అయితే సాహా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై సంచలన ఆరోపణలు చేశాడు.
గంగూలీ తనకు సపోర్ట్ గా నిలిస్తే రాహుల్ తనను రిటైర్మెంట్ చేయమంటూ సూచించాడని మండిపడ్డాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఈ తరుణంలో భారతీయ క్రికెట్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్(Gavaskar) స్టార్ ఆటగాళ్లు రహానే, పుజారాలపై సంచలన కామెంట్ చేశాడు. వారిద్దరూ బాగా ఆడాలని, రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందన్నాడు.
అయితే వీరి స్థానాల్లో వచ్చిన యువ క్రికెటర్లు గనుక పాతుకు పోతే వీరి కెరీర్ ఇబ్బందికరమేనని పేర్కొన్నాడు. వీరిద్దరూ సౌతాఫ్రికా టూర్ లో పేలవమైన ప్రదర్శన చేశారు.
Also Read : ‘రహానే..పుజారా’కు బీసీసీఐ షాక్