Rahul Dravid : బీసీసీఐలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రపచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరున్న ఈ సంస్థకు చీఫ్ గా సౌరవ్ గంగూలీ ఉన్నాడు.
మరో వైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జే షా ప్రస్తుతం చక్రం తిప్పుతున్నాడు. ఇక సెలెక్షన్ కమిటీ చైర్మన్ మాజీ పేసర్ చేతన్ శర్మ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జట్టు ఆటగాళ్ల ఎంపిక కత్తిమీద సాముగా మారింది.
ఈ తరుణంలో శ్రీలంక సీరీస్ కోసం ప్రకటించిన జట్టులో స్టార్ ఆటగాళ్లు రహానే, పుజారా, ఇషాంత్ శర్మతో పాటు వృద్దిమాన్ సాహాను పక్కన పెట్టేశారు.
దీంతో తనను తీసుకుంటానని బీసీసీఐ చీఫ్ దాదా మాట ఇచ్చాడని కానీ హెడ్ కోచ్ ద్రవిడ్(Rahul Dravid )మాత్రం రిటైర్మెంట్ వైపు ఆలోచించమని సలహా ఇచ్చాడంటూ బాంబు పేల్చాడు.
దీంతో దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారంపై, సాహా కామెంట్స్ పై రచ్చగా మారింది. సాహా తనపై చేసిన ఆరోపణలపై స్పందించాడు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid ). తాను, రోహిత్ శర్మ మంచి జట్టును కావాలని కోరుకుంటాం.
నిక్కచ్చిగా ఉంటాం. సాహా అంటే గౌరవం ఉంది. కానీ అతడి ఆలోచనే సక్రమంగా లేదని పేర్కొన్నాడు రాహుల్ ద్రవిడ్. భారత విజయాల్లో సాహా ఉన్నాడు. కాదనలేం.
కానీ జట్టు కూర్పులో ఎవరు ఉండాలో ఎవరు ఉండ కూడదో ముందే ఓ క్లారిటీకి వస్తాం. ఆ తర్వాత ఎంపిక కాని వారిని కూర్చోబెట్టి ఎందుకు పక్కన పెట్టామనే దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పాడు.
తప్పుగా అర్థం చేసుకుంటే తామేమీ చేయలేమన్నాడు ద్రవిడ్. అందరినీ సంతృప్తి పర్చడం తన పని కాదన్నాడు.
Also Read : ఎండా కాలంలో ఐపీఎల్ పండగ