Tu Jhoom Song : ఆ స్వరంలో దైవం ఉంది. ప్రపంచాన్ని మెస్మ రైజ్ చేసే మాధుర్యం దాగి ఉంది. బతుకు రాస్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు అబిదా పర్వీన్ ..నసీబ్ లాల్ గొంతుల్లోంచి వచ్చే ఏ పాటైనా వినండి హృదయం తేలికవుతుంది.
మనసు దూది పింజె లాగా మారి పోతుంది. ఆ స్వరాలకు మంత్ర ముగ్ధుల్ని చేసే సత్తా ఉంది. అందుకే తాజాగా కోక్ స్టూడియో విడుదల చేసిన తు ఝూమ్ పాట (Tu Jhoom Song)ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేస్తోంది.
విడుదల చేసిన వెంటనే కోట్లల్లోకి చేరి పోయారు వ్యూయర్స్. నెట్టింట్లో ఇప్పుడు తు ఝూమ్ సలామ్(Tu Jhoom Song) అంటున్నారు పాటల ప్రేమికులు. జుల్ఫీ పుణ్యమా అంటూ ఈ సాంగ్ ను అబిదా పర్వీన్ ..నసీబ్ లాల్ తన్మయత్వంతో పాడారు.
స్వర గతుల్ని పలికించారు. పాటకు కథనాన్ని జుల్ఫీ అందిస్తే అద్నాన్ ధూల్ రాశారు తు ఝూమ్ పాటను. సంగీతం కూడా జుల్ఫీ అందించారు. జుల్ఫీతో పాటు అబ్దుల్లా సిద్దిఖీ నిర్మించారు.
కోక్ స్టూడియో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. ఆసిఫ్ అలీ తబలా అందిస్తే పలువురు కళాకారులు ఈ పాటకు ప్రాణం పోశారు. అహసన్ రాజా ఫోటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది.
సైదా మరియం, సైఫ్ షామ్స్ సహాయ దర్శకులుగా పని చేశారు. సాద్ షేక్ , వజీహా వస్తీ నృత్య దర్శకులుగా వ్యవహరించారు. ఈ ప్రపంచం అందమైంది.
వచ్చేటప్పుడు ఏమీ తీసుకు రాలేదు. వెళ్లేటప్పుడు ఏమీ తీసుకు వెళ్లలేం. ప్రేమ ఒక్కటే ఇవ్వగలం ఈ లోకానికి అన్న సందేశం తు ఝూమ్ లో చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read : మీ అభిమానం గుండెల్లో పదిలం