Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ మనోహర్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ పై కీలక కామెంట్స్ చేశాడు.
దూకుడు కొంచెం తగ్గించు కోవాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రధానంగా బ్యాటర్ లకు కావాల్సింది టైమింగ్ ముఖ్యమన్నాడు. ఒకే మూస ధోరణితో ముందుకు వెళ్లడం మంచిది కాదని సూచించాడు గవాస్కర్(Sunil Gavaskar ).
ఇదిలా ఉండగా ఇషాన్ కిషాన్ టీ20 లో రెచ్చి పోయాడు. లంకేయుల భరతం పట్టాడు. ఎలాంటి బంతులు వచ్చినా వాటిని పరుగులు తీసేందుకే ఇష్టపడ్డాడు.
దీంతో కేవలం 56 బంతులే ఆడిన ఈ డైనమిక్ స్టార్ 10 ఫోర్లు 3 సిక్సర్లతో 89 రన్స్ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతంలో ధోనీ, రిషబ్ పంత్ సాధించని ఫీట్ ను సాధించి ఔరా అనుకునేలా చేశాడు.
ఇక టీ20 ఫార్మాట్ లో వ్యక్తిగత స్కోర్ లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్ గా వినుతికెక్కాడు. గణనీయమైన రికార్డు ఉన్నప్పటికీ జట్టులో కంటిన్యూగా ఆడాలని అనుకుంటే మాత్రం నిలకడగా ఆడాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar ).
ఇప్పటికే నైపుణ్యం, సత్తా కలిగిన ఆటగాళ్ల సంఖ్య రాను రాను పెరిగి పోతోందన్నాడు. ప్రధానంగా ఐపీఎల్ మెగా లీగ్ రావడంతో ప్రస్తుతానికి భారత జట్టుకు ఎలాంటి ఢోకా లేకుండా పోయిందన్నాడు.
దమ్మున్న, సత్తా కలిగిన ప్లేయర్లు రావడం శుభ పరిణామమని పేర్కొన్నాడు సన్నీ. విండీస్ తో రాణించ లేదు అందుకే జాగ్రత్తగా ఆడాలని సూచించాడు.
Also Read : బుమ్రా పర్ ఫార్మెన్స్ సూపర్