Shane Warne : గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఆడిన ఇంగ్లండ్ ఘోరమైన ఓటమి చవి చూసింది.
ఈ పరాజయానికి బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి క్రిస్ సిల్వర్ వుడ్ తప్పించేలా చేసింది. ప్రస్తుతానికి పాల్ కాలింగ్ వుడ్ తాత్కాలిక ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు.
ఇదిలా ఉండగా హెడ్ కోచ్ పదవిని ఇంకా భర్తీ చేయలేదు క్రికెట్ బోర్డు. ప్రస్తుతం మంచి మెంటార్,, కోచ్ ను ఎంపిక చేసే పనిలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన మాజీ క్రికెటర్ల కోసం వేచి చూస్తోంది.
ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించే పనిలో పడింది. ఇదే క్రమంలో హెడ్ కోచ్ రేసులో ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తను కూడా ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా పని చేసేందుకు రెడీగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
ఇప్పటికే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు, లండన్ స్పిరిట్ జట్లకు మెంటార్ గా షేన్ వార్న్ ఉన్నాడు. ప్రత్యేకించి ఆటపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. వారిని అద్భుతమైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు షేన్ వార్న్(Shane Warne).
ఇంగ్లండ్ జట్టుకు సంబంధించి ప్రధాన కోచ్ గా నియమించినట్లయితే లేదా ఛాన్స్ ఇస్తే తన సత్తా ఏమిటో చూపిస్తానని చెప్పారు. ఇప్పటికే తాను కోచ్ గా మరింత పరిణతి చెందానని స్పష్టం చేశాడు షేన్ వార్న్. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read : ఐపీల్ ఫార్మాట్ బీసీసీఐ డిక్లేర్