IND vs SL 3rd T20 : భారత్ వేదికగా ధర్మశాలలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20 మ్యాచ్ లు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సీజన్ లో న్యూజిలాండ్ , వెస్టిండీస్ ల తర్వాత శ్రీలంక (IND vs SL 3rd)కూడా ఓడిపోయిన జట్ల సరసన చేరింది.
అవేశ్ ఖాన్ 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక హైదరాబాద్ స్టార్ పేసర్ సిరాజ్ 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. హర్షల్ 29 పరుగులు ఇచ్చి మరో వికెట్ తీశారు. శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.
కెప్టెన్ షనక 38 బంతులు ఆడి 9 ఫోర్లు 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.కానీ జట్టును గట్టెక్కించ లేక పోయాడు. ఓ వైపు లంకేయులు పెవిలియన్ దారి పడుతున్నా స్కిప్పర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
టార్గెట్ ఛేదించే క్రమంలో టీమిండియా 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది. ఈ 20 సీరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ అవార్డులు అందుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్ లో ప్రధానంగా చెప్పాల్సింది ఒక్కడే షనక. శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. వచ్చీ రాగానే లంకేయుల భరతం పట్టాడు. దుమ్ము రేపాడు. శాంసన్ నిరాశ పరిచాడు. 18 పరుగులు చేశాడు.
దీపక్ హూడూ 21 పరుగులు చేస్తే వెంకటేశ్ అయ్యర్ 5 పరుగులు చే్తే, జడేజా 22 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. మొత్తం మీద ఇద్దరు మాత్రం కీలకంగా మారారు శ్రేయాస్ అయ్యార్, శ్రీలంక స్కిప్పర్ షనక.
Also Read : సంజూ శాంసన్ పై రోహిత్ శర్మ కితాబు