Russia Ukraine War : చ‌ర్చ‌లు సాగేనా యుద్దం ముగిసేనా

సంధి అంటూనే ర‌ష్యా స‌మ‌ర‌నాదం

Russia Ukraine War  : ఉక్రెయిన్ పై ఊపిరి స‌ల‌ప నీయ‌కుండా యుద్దం ప్ర‌క‌టించిన ర‌ష్యా ఎవ‌రినీ బేఖాత‌ర్ చేయ‌డం లేదు. వార్ ప్రారంభ‌మై నేటికీ ఎనిమిది రోజులు కావ‌స్తోంది. కానీ వార్ మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది.

బాంబుల దాడులు ఆప‌డం లేదు. మిస్సైల్స్ తో భీభ‌త్సం సృష్టిస్తోంది ర‌ష్యా. ఐక్య రాజ్య స‌మితి, యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు, బ్రిట‌న్, అమెరికా, ఫ్రాన్స్ యుద్దం వ‌ద్దంటూ పిలుపునిచ్చాయి.

కానీ ఇప్ప‌టి దాకా ర‌ష్యాRussia Ukraine War )దాని గురించి ఊసెత్త‌డం లేదు. ప్ర‌పంచానికి శాంతి కావాలే త‌ప్పా యుద్దం కాదంటోంది ప్ర‌పంచం. అటు ఉక్రెయిన్ ఇటు ర‌ష్యా రెండూ త‌గ్గ‌డం లేదు. ఎవ‌రికి వారే ఆధిపత్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌స్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌సారి చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ ఆ చ‌ర్చ‌లు ఫ‌ల‌వంతం కాలేదు. తాజాగా మ‌రి కొద్ది గంట‌ల్లో ఉక్రెయిన్ , ర‌ష్యా దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇరు దేశాలు యుద్దంలో భారీగా న‌ష్ట పోయాయి. చూస్తే చిన్న దేశం అయిన‌ప్ప‌టికీ ఉక్రెయిన్ (Russia Ukraine War )మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. త‌ల‌వంచ‌డం లేదు.

గెల‌వ‌క పోయినా స‌రే త‌మ ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టే ప్ర‌స‌క్తి లేదంటూ స్ప‌ష్టం చేశారు దేశాధ్య‌క్షుడు గెలెన్స్కీ. ర‌ష్యా ల‌క్ష్యం ఒక్క‌టే. అధ్య‌క్షుడిని, ఆయ‌న కుటుంబాన్ని నాశ‌నం చేయాల‌ని అనుకుంటోంది.

ప్ర‌స్తుతం విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు బెలార‌స్ లో మ‌రో ద‌ఫా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌త నెల 28న జ‌రిగిన చ‌ర్చ‌లు నాలుగు గంట‌ల‌కు పైగా జ‌రిగాయి.

కానీ ఫ‌ల‌వంతం కాలేదు. ఏది ఏమైనా శాంతి నెల‌కొంటేనే బెట‌ర్ అంటున్నాయి మిగ‌తా దేశాలు.

Also Read : ర‌ష్యా సంచ‌ల‌నం యుద్దానికి సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!