Sunil Kanugolu : దేశ వ్యాప్తంగా ఆక్టోపస్ లో అల్లుకు పోయిన భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేందుకు నానా తంటాలు పడుతోంది కాంగ్రెస్ పార్టీ. వందేళ్లకు పైగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఆ పార్టీ ఇప్పుడు ఎన్నడూ లేని రీతిలో అంతర్గత పోరుతో అల్లాడుతోంది.
నాయకత్వ లేమి ఆ పార్టీని ఎక్కువగా పీడిస్తోంది. ఎన్నో పదవులు అనుభవంచిన కాంగ్రెస్ సీనియర్లు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
ఇక బీజేపీ విభజించు పాలించు అనే సూత్రాన్ని పక్కాగా అమలు చేస్తోంది.
ఇక పైకి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నా ఐపాక్ ఫౌండర్ ,
ఇండియన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీజేపీకి మేలు చేకూర్చేలా పావులు కదుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ దళానికి షాక్ ఇచ్చేలా తిరిగి పవర్ లోకి వచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈనెల 10న ఉత్తర ప్రదేశ్ , గోవా , పంజాబ్ , మణిపూర్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాల భవితవ్యం ఏమిటనేది తేలుతుంది.
ఇక బీజేపీ ఈ ఫలితాలు బీజేపీ పనితీరుకు రెఫరెండమ్ గా భావిస్తోంది.
ఈ తరుణంలో సీనియర్లతో పాటు జూనియర్లను కలుపుకుని పోయేలా , అసమ్మతి స్వరాలకు చెక్ పెట్టేలా బీజేపీని గద్దె దించే యోచనలో ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ తో పని చేసి ఆ తర్వాత విభేదించిన పేరెన్నికగన్న
రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు (Sunil Kanugolu )పూర్తి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా మరింత పెంచేలా ఆయనకు సర్వాధికారాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొదట పీకేతో సంప్రదింపులు జరిపినా ఆ తర్వాత ఎందుకనో వర్కవుట్ కాలేదు.
పీకే ప్లేస్ లో కనుగోలును రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యారని, ఇందులో భాగంగానే ఆయన అనేకసార్లు పార్టీ చీఫ్ తో భేటీ అయినట్లు తెలిసింది.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకు వచ్చేలా, రాహుల్ ఇమేజ్ మరింత పెంచేలా చేయాలని చెప్పినట్లు టాక్.
ఇదిలా ఉండగా గతంలో సునీల్ బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకే, అకాళీదళ్ కు పని చేశారు.
Also Read : విదేశీ విద్య వ్యామోహం ప్రాణాలకే ప్రమాదం తెచ్చింది