Shane Warne : క్రికెట్ దిగ్గ‌జం షేన్ వార్న్ హ‌ఠాన్మ‌ర‌ణం

అద్భుత ఆట‌గాడిని కోల్పోయిన ప్ర‌పంచం

Shane Warne  : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గ‌జం, ప్ర‌ముఖ స్పిన్న‌ర్ షేన్ వార్న్(Shane Warne )ఇవాళ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. యావ‌త్ క్రికెట్ లోకం అత‌డి మ‌ర‌ణ వార్త విని శోక సంద్రంలో మునిగి పోయింది.

స్పిన్న‌ర్ గా త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకున్నాడు వార్న్. అద్భుత‌మైన ఆట‌గాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న పూర్తి పేరు షేన్ కీత్ వార్న్ . 1969 సెప్టెంబ‌ర్ 13న పుట్టారు. ఆస్ట్రేలియా లోని విక్టోరియా గ‌ల్లీ ప్రాంతం ఆయ‌న‌ది.

క్రికెట్ ఫార్మాట్ లో అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు క‌లిగిన క్రికెట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయ‌న‌కు ముద్దు పేరు కూడా ఉంది అదే వార్నీ(Shane Warne ). కుడి చేతి బ్యాట‌ర్ గా , రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌల‌ర్ గా చ‌రిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియా జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించాడు. అనేక విజ‌యాల‌లో పాలు పంచుకున్నాడు షేన్ వార్న్. 1992 నుంచి 2007 దాకా త‌న కెరీర్ సాగింది. 1992 జ‌న‌వ‌రి 2న ఇండియాతో టెస్ట్ అరంగేట్రం చేశాడు.

వ‌న్డే మ్యాచ్ న్యూజిలాండ్ తో 1993 మార్చి 24న ప్రారంభించాడు. విక్టోరియా త‌ర‌పున ఆడాడు. 2000 – 2007 దాకా హాంప్ షైర్ త‌ర‌పున ప్రాతినిధ్యం వహించాడు.

2008 నుంచి 2011 దాకా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఆడాడు షేన్ వార్న్. క్రికెట‌ర్ గానే కాదు అద్భుత‌మైన కామెంటేట‌ర్ కూడా. ఆస్ట్రేలియా జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.

ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో టాప్ బౌల‌ర్ల‌లో ఒక‌టిగా పేరొందాడు వార్న్. 1994లో విస్డ‌న్ క్రికెట‌ర్ అవార్డుకు ఎంపిక‌య్యాడు. 1997లో నిషేధానికి గుర‌య్యాడు. 2004లో లీడింగ్ క్రికెట‌ర్ ఆఫ్ ది వ‌ర‌ల్డ్ అవార్డు పొందాడు.

విజ్డ‌న్ క్రికెట‌ర్స్ ఆఫ్ ది సెంచ‌రీలో ఒక‌రిగా ఎంపిక‌య్యాడు. 2013 జూలైలో ఆట నుంచి నిష్క్ర‌మించాడు షేన్ వార్న్.

Also Read : ఈ క్ష‌ణం అద్భుతం కోహ్లీ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!