PAK vs AUS 1st Test : సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడుతున్న పాకిస్తాన్(PAK vs AUS 1st Test )దుమ్ము రేపింది. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. రావిల్పిండి వేదికగా ఇవాళ మొదటి టెస్టు ప్రారంభమైంది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 245 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 132 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
1998 తర్వాత భద్రతా కారణాల రీత్యా ఆస్ట్రేలియా పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఒప్పు కోలేదు. ఇదిలా ఉండగా రావిల్పిండికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెషావర్ లోని షియా మసీదులో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.
ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ఘటన ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇంకా తెలియ రాలేదు.
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు సంయుక్తంగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆట ముగిసే సమయానికి వెటరన్ ప్లేయర్ అజర్ అలీ 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
అంతకు ముందు పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసిస్ ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేక పోయింది. హక్ షఫీక్ తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక్కడే వికెట్ తీశాడు. షఫీక్ 44 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
Also Read : ప్రేమ నిజం ఆమె అద్బుతం