Shane Warne : క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాడిగా పేరొందిన ఆసిస్ క్రికెటర్ షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాభిమానులనే కాదు క్రికెటర్లను కోలుకోలేని షాక్ కు గురి చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. మరికొందరు ఇది నమ్మశక్యం కానిదంటూ పేర్కొన్నారు.
1999లో ప్రపంచ కప్ గెలవడంతో వార్న్(Shane Warne )కీలక పాత్ర పోషించాడు.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్ల సంతాపాలతో సోషల్ మీడియా నిండి పోతోంది. కేవలం 52 ఏళ్ల వయసులో ఆయన కాలం చేశారు.
గుండె పోటుతోనే మరణించినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ప్రపంచంలోనే ఎన్నదగిన ఆటగాళ్లలో ఒకడిగా అభివర్ణించారు. టెస్టుల్లో 708 వికెట్లు తీశాడు. అద్భుతమైన లెగ్ స్పిన్నర్ గా పేరొందాడు.
కామెంటేటర్ గా పని చేశాడు. ప్రముఖ క్రికెటర్లు తమ సంతాపాన్ని తెలిపారు.
షేన్ వార్న్ మరణ వార్తను జీర్ణించు కోలేక పోతున్నా. నా కెరీర్ లో కొన్ని అద్భుతమైన క్షణాలు పంచుకున్నానని పేర్కొన్నాడు అజింక్యా రహానే.
ఆల్ టైమ్ గ్రేటెస్ట్ స్పిన్ బౌలర్ వార్న్ అన్నాడు గ్యారీ లినేకర్.
ప్రపంచ క్రికెట్ లో ఆటకు వన్నె తెచ్చిన అరుదైన క్రికెటర్ ..బౌలర్ అని పేర్కొంది విస్డన్. మణికట్టు స్పిన్నర్లలో వార్న్(Shane Warne )ఒకడు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నా శ్రీకాంత్ పేర్కొన్నాడు.
క్రికెట్ సోదరులందరికీ ఇది విషాదకరమైన రోజు అని వాపోయాడు హఫీజ్. ఇది వినాశకరమైన వార్త.
నన్ను కలచి వేసింది. ఇప్పటికీ నేను షాక్ లో ఉన్నానని తెలిపాడు షోయబ్ అక్తర్. గొప్ప స్పిన్నర్లలో వార్న్ ఒకడు.
అలాంటి బౌలర్ ఇక రాడన్న లేడన్న వార్త నమ్మకలేక పోతున్నానని అన్నాడు వీరేంద్ర సెహ్వాగ్.
నాకు దిశా నిర్దేశం చేస్తాడని అనుకున్నా. కానీ ఆయన లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతున్నానని వాపోయాడు షాదాబ్ ఖాన్.
ప్లీజ్ ఇది నిజం కాదని చెప్పండి అని ఆవేదన చెందాడు దినేష్ కార్తీక్. అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన గొప్ప
ప్లేయర్ అని పేర్కొంది ఐస్ లాండ్ క్రికెట్. లెజెండ్ ను కోల్పోవడం బాధాకరమన్నాడు రోహిత్ శర్మ.
ఏం మాట్లాడో తెలియడం లేదు వార్న్ లేడన్న వార్త నమ్మలేక పోతున్నా అన్నాడు శిఖర్ ధావన్. నా తరంలో అతి పెద్ద సూపర్ స్టార్ వెళ్లి పోయాడని కన్నీటి పర్యంతం అయ్యాడు వకార్ యూనిస్ .
బౌలింగ్ ను మ్యాజిక్ గా మార్చిన దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ అన్నాడు గౌతం గంబీర్. క్రికెట్ ఆటకు ఇవాళ దుర్దినం అన్నాడు బుమ్రా. ఇది నమ్మలేక పోతున్నా.
ఎన్నో మ్యాచ్ లలో ఎదురు పడ్డాం. కానీ ఇంత లోనే మమ్మల్ని విడిచి వెళ్లి పోతాడని అనుకోలేదన్నాడు భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్.
Also Read : మారణహోమానికి ముగింపు లేదా