Sachin Shane Warne : యావత్ క్రీడా లోకం విస్తు పోయింది. ప్రపంచ క్రికెట్ లో ఆల్ టైమ్ ఆటగాడిగా పేరొందిన ఆసిస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ (Sachin Shane Warne)మరణ వార్తతో. ఇప్పటికీ ఎవరూ ఈ విషాదకరమైన వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు.
బౌలర్ గా అసాధారణమైన ప్రతిభా పాటవాలను కలిగిన ఈ మహోతన్నత క్రికెట్ దిగ్గజం ఇక లేడన్న నిజాన్ని తట్టుకోలేక పోతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులే కాదు తాజా, మాజీ క్రికెటర్లు సైతం వార్న్ లోకాన్ని వీడారన్న సంగతి విని ఇది నిజం కాక పోయి ఉండి వుంటే బాగుండేదని అనుకున్నారు.
మూడు ఫార్మాట్ లలో రాణించాడు. తనదైన శైలితో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థుల గుండెల్లో తన బంతులతో నిద్ర లేకుండా చేశాడు. తనతో ప్రత్యేక అనుబంధం కలిగిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కన్నీటి పర్యంతం అయ్యాడు.
మిత్రమా ఎందుకిలా ఇంత చిన్న వయసులో మమ్మల్ని వీడి వెళ్లి పోయావంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. దిగ్గజ ఆటగాళ్లకు చుక్కలు చూపించిన షేన్ వార్న్ కు కోలుకోలేకుండా చేసింది మాత్రం సచిన్ మాత్రమే.
అతడి బౌలింగ్ ను తట్టుకుని పరుగుల వరద పారించాడు. మైదానంలో వీరిద్దరూ నువ్వా నేనా అన్న రీతిలో తలపడినా బయట మాత్రం సచిన్, షేన్ వార్న్ మంచి స్నేహితులు. ఆ స్నేహం ఈనాటికీ చెక్కు చెదరకుండా ఉండి పోయింది.
వార్న్ మరణం తో ఒక్కసారిగా మౌనంగా ఉండి పోయాడు సచిన్ టెండూల్కర్. ఈ సందర్భంగా నువ్వు లేవు నీ మరణం నన్ను మరింత బాధకు గురి చేస్తోంది మిత్రమా అని నివాళులు అర్పించాడు.
Also Read : ఈ క్షణం అద్భుతం కోహ్లీ భావోద్వేగం