UNSC India : రష్యాతో మొదటి నుంచి అంటకాగుతూ వస్తున్న భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చూసీ చూడనట్టు జోక్యం చేసుకోక పోవడం వల్ల భారీ నష్టం వాటిల్లింది.
అత్యధికంగా భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో మెడిసిన్, తదితర కోర్సులు చదువుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు. 20 వేల మందికి పైగా విద్యార్థులు అక్కడ ఉన్నారని అంచనా.
ఇప్పటి దాకా 3 వేల మందికి పైగా విద్యార్థులను స్వదేశానికి తీసుకు వచ్చింది. కేంద్ర సర్కార్ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. మొదటి నుంచి అంతర్జాతీయ పరంగా తనకేమీ పట్టనట్టు ఉంది భారత్.
యుద్దాన్ని ఆపాలని పలుమార్లు కోరినా ఈరోజు వరకు స్పందించలేదు రష్యా చీఫ్ పుతిన్. ఉక్రెయిన్ అంశంలో ఇండియా మరోసారి తటస్థ వైఖరి వైపు మొగ్గు చూపింది.
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి జనరల్ అసెంబ్లీ లో ఓటింగ్ కు గైర్హాజర్ అయ్యింది భారత్. తాజాగా మరోసారి ఓటింగ్ కు దూరంగా ఉండడంపై పలు దేశాలు అభ్యంతరం తెలిపాయి.
రష్యా సైనిక చర్య తర్వాత ఉక్రెయిన్ లో భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన చోటు చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో స్వతంత్రంగా విచారణ కమిషన్ ను వెంటనే ఏర్పాలు చేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం (UNSC India)ఓటింగ్ నిర్వహించింది.
ఇండియా, చైనా, పాకిస్తాన్ , సూడాన్ , వెనిజులా తో పాటు 13 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్ , జర్మనీ , జపాన్ , యూఏఈ, నేపాల్ సహా 32 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి.
Also Read : రియాక్టర్ల ధ్వంసం అణు కేంద్రం స్వాధీనం