Zelensky : ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్ష దాడులు చేస్తోంది. అంతే కాదు తమ దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశం విడిచి పారి పోయాడంటూ, పోలాండ్ లో తల దాచుకున్నాడని అవాకులు పేలింది రష్యా.
ఈ తాజా కామెంట్స్ పై నిప్పులు చెరిగాడు జెలెన్ స్కీ(Zelensky) . దమ్ముంటే దా పుతిన్ నువ్వొక్కడివే రా. ఎవరూ లేకుండా రా..నేను వస్తా. ఇద్దరం తలపడదాం. ఎవరు విజేతలో తేల్చుకుందామంటూ సవాల్ విసిరాడు.
ఈ మేరకు తాను అధ్యక్ష భవనంలోనే ఉన్నానని కావాలంటే వచ్చి చూసుకో అంటూ మండిపడ్డాడు. తాను ఎక్కడికీ పారి పోలేదని అంత పిరికి వాడిని కాదన్నాడు. తన రక్తంలో ధైర్యం ఉందని, వెన్ను చూపే మనస్తత్వం తనకు లేదని స్పష్టం చేశాడు.
తాను దేశ రాజధాని కీవ్ ప్రధాన కార్యాలయంలో ఉన్నానని పేర్కొన్నాడు. ఓ అధికారితో కలిసి ఉన్న వీడియోను విడుదల చేశాడు జెలెన్ స్కీ. ఇదిలా ఉండగా గత నెల ఫిబ్రవరి 24న రష్యా వార్ ప్రారంభం అయ్యాక ఓ వీడియోను తానే విడుదల చేశాడు.
ఆ తర్వాత రెండో వీడియోను ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సందేశం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. యుద్దం ముగిసేంత దాకా ఇక్కడే ఉంటా.
విజయమో వీర స్వర్గమో తేల్చుకునేంత దాకా నేను ఎక్కడికీ వెళ్లను. నీలాగా నాలుగు గోడల మధ్య బందీని కానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
చేతకాని దద్దమ్మలే తలదాచుకుంటారని ఎద్దేవా చేశాడు. దమ్ముంటే దా నువ్వొక్కడివే రా అంటూ నిప్పులు చెరిగాడు జెలెన్ స్కీ..
Also Read : భారత్ సాయం తాలిబన్ల సంతోషం