Ravindra Jadeja : స్వదేశంలో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించిన భారత్ ఏ కోశాన ప్రత్యర్థి జట్టుకు పరుగులు చేసేందుకు ఛాన్స్ ఇవ్వలేదు.
ఇక ప్రత్యేకించి చెప్పు కోవాల్సింది ఒకే ఒక్కడు అతడే జడ్డూ అలియాస్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja). కొంత గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చిన జడ్డూ దుమ్ము రేపాడు. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ తనదైన రీతిలో సత్తా చాటాడు.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా 578 పరుగులు చేసింది. ఈ రన్స్ లో జడ్డూ 175 పరుగులు చేశాడు. అంతే కాదు శ్రీలంక ఫాలోఆన్ ఆడింది. ఇందులో శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ లో 174 పరుగులు చేస్తే రెడో ఇన్నింగ్స్ లో 178 రన్స్ చేసింది.
222 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక రవీంద్ర జడేజా శ్రీలంక జట్టు పతనాన్ని శాసించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో పరుగుల వేట సాగించిన ఈ స్టార్ ప్లేయర్ బౌలింగ్ లో సైతం సత్తా చాటాడు.
మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీస్తే రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ టెస్టు మ్యాచ్ పూర్తిగా రవీంద్ర జడేజాదేనని చెప్పక తప్పదు.
ఇక రవీంద్ర జడేజా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 228 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు 4 సిక్సర్లతో 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఒకే టెస్టులో 150కి పైగా పరుగులు ..ఐదు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు జడ్డూ.
ఇక జడేజా టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది 10వ సారి కావడం విశేషం.
Also Read : తప్పంతా నాదే వాళ్లది కాదు