Indian Women Team : న్యూజిలాండ్ వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. భారత, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో భారత జట్టు భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
భారత క్రికెట్ జట్టు స్కిప్పర్ , హైదరాబాదీ స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ (Indian Women Team )వరుసగా ఆరు వరల్డ్ కప్ లలో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ తర్వాత ఆమె ఆట నుంచి నిష్క్రమించనుంది.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ కూతురుతో కలిసి ఈ టోర్నీలో పాల్గొంది. ఇక మ్యాచ్ పూర్తయ్యాక భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత, పాకిస్తాన్ దేశాల మధ్య వైరుధ్యాలు ఉన్నా క్రికెట్ ఆటలో మాత్రం అలాంటి బేదాభిప్రాయాలు అంటూ ఉండవని మరోసారి నిరూపించారు.
ఇటీవల దుబాయి వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుపై గ్రాండ్ విక్టరీ సాధించిన పాకిస్తాన్ ప్లేయర్లను అభినందించారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ. ఇదే క్రీడా స్పూర్తిని భారత విమెన్స్ టీం తాజాగా చాటుకుంది.
డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బిడ్డతో ఆడుకున్నారు. ఆరు నెలల వయసు ఉన్న ఆ బేబీని ఎత్తుకుని ఆడించారు. తనతో ఫోటోలు కూడా దిగారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది బీసీసీఐ.
ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. భారతీయ మహిళా క్రికెటర్లు చేసిన ఈ పనికి ప్రపంచ వ్యాప్తంగా సంతోషం వ్యక్తం చేస్తోంది.
Also Read : వార్న్ మరణంపై అనుమానం