AP Govt Tickets : గత కొంత కాలంగా నాన్చుతూ వచ్చిన సినీ టికెట్ల ధరల సమస్యకు ఎట్టకేలకు చెక్ పెట్టారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. ఇటీవల సినీ ఇండస్ట్రీ తరపు నుంచి సినీ పెద్దలు (AP Govt Tickets)ఆయనను కలిశారు.
ఈ మేరకు ఆమోద యోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి ఇవాళ సినిమా టికెట్ల ధరలకు సంబంధించి సవరణలు చేసింది.
ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా జీవోను విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ లో నాన్ ఏసీ టాకీస్ లలో రూ. 60, రూ. 40 గా నిర్ణయించింది.
ఏసీ థియేటర్లలో రూ. 100, రూ. 70, స్పెషల్ టాకీస్ లలో రూ. 125, రూ. 100 గా నిర్ణయించింది. మల్టీ ప్లెక్స్ లలో రెగ్యులర్ సీట్లకు రూ. 150, రిక్లయినర్ సీట్లకు రూ. 250 గా సవరించింది.
ఇక నగరాలు, గ్రామ పంచాయతీలలో నాన్ ఏసీ థియేటర్లలో రూ. 40, రూ. 20, ఏసీ థియేటర్లలో రూ. 70 , రూ. 50 , స్పెషల్ థియేటర్లలో రూ. 90 , రూ. 70 గా సవరించింది ప్రభుత్వం.
ఇక ఆయా ప్రాంతాలలో మల్టీ ప్లెక్స్ లు గనుక ఉన్నట్లయితే రెగ్యులర్ సీట్లకు రూ. 100 , రిక్లయినర్ సీట్లకు రూ. 250 చొప్పున సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా ఇందులో మరో మెలిక కూడా పెట్టింది. అదేమిటంటే ఆయా టికెట్లకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు అదనం అని పేర్కొంది. అంటే సినిమా చూడాలంటే జేబులు గుల్ల కావాల్సిందే అన్నమాట.
మొత్తంగా చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల, రాజమౌళి, ఆలీ, పోసాని , ఆర్. నారాయణ మూర్తి సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
Also Read : విషాదాంత ముగింపు ‘సమ్మతమే’ నా?