Women’s Day : ప్రతి ఏటా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపు కోవడం ఆనవాయితీగా వస్తోంది. మహిళల సాధికారికత, సాంస్కృతిక, సామాజిక,
రాజకీయ, ఆర్థిక, తదితర రంగాలలో తమదైన ముద్ర కనబరుస్తూ వస్తున్నారు. పలు దేశాలను శాసించే స్థాయికి ఎదిగారు.
ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపు కోవడం విశేషం.
ఇదిలా ఉండగా ఐక్య రాజ్య సమితి ప్రతి ఏటా మహిళలకు సంబంధించి పాటించాలని డిక్లేర్ చేసింది.
అదేమిటో తెలుసుకుందాం. ఆనాటి 1996 నుంచి నేటి 2022 సంవత్సరం దాకా మహిళల కోసం పాటిస్తూ వస్తోంది.
1996 సంవత్సరాన్ని సెలబ్రేటింగ్ ది పాస్ట్ , ప్లానింగ్ ఫర్ ది ఫ్యూచర్ ( గతాన్ని వేడుకగా జరుపుకుందాం,
భవిష్యత్తు కోసం ప్రణాళిక చేసుకుందాం ) పిలుపునిచ్చింది. 1997 ను మహిళలు, శాంతి కోసం నిర్వహించారు.
1998 సంవత్సరాన్ని మహిళలు, మానవ హక్కుల దినోత్సవంగా పాటించారు.
1999ని మహిళలపై హింస లేని ప్రపంచంగా జరుపు కోవాలని పిలుపునిచ్చింది. 2000 సంవత్సరాన్ని శాంతి కోసం మహిళలు ఏకం కావాలని ,.
2001ని ఉమెన్ అండ్ పీస్ విమెన్ మేనేజింగ్ కన్ ఫ్లిక్ట్స్ గా ప్రకటించింది ఐక్య రాజ్య సమితి.
2002 సంవత్సరాన్ని ఆఫ్గనిస్తాన్ మహిళలు వాస్తవాలు, అవకాశాలు ఉండాలని సూచించింది.
2003లో లింగ సమానత్వం, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు, 2004ను మహిళలు, హెచ్ఐవీ, ఎయిడ్స్ కు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది.
2005 సంవత్సరాన్ని లింగ సమానత్వం కోసం , 2005ను మరింత సురక్షితమైన, భద్రమైన భవిష్యత్తును నిర్మించాలని పిలుపునిచ్చింది.
2006లో అన్ని రంగాలలో సాధికారతకు దర్పణంగా నిలిచేలా నిర్ణయాలు తీసుకోవడం, 2007లో మహిళలు,
బాలికలపై హింస శిక్షార్హత ముగింపు , 2008లో మహిళలు, బాలికలకు భరోసా ఇవ్వడం, బాలికలపై హింసను అంతం చేయాలని పిలుపునిచ్చింది.
2009 సంవత్సరాన్ని మహిళలు, పురుషుల సమానత్వం కోసం, 2010లో మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ..అందరికీ పురోగతి ఉండాలని పిలుపునిచ్చింది.
2011లో విద్య, శిక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సమాన అవకాశాలు, మహిళలకు ఉపాధి, పని ఇవ్వడం,
2012లో గ్రామీణ మహిళలకు సాధికారత, పేదరికం, ఆకలిని అంతం చేయాలని మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది.
2013ల ఒక వాగ్ధానం మహిళలపై (Women’s Day)హింసను అంతం చేసేందుకు ప్రయత్నం చేయడం, 2014లో మహిళలకు సమానత్వం,
ప్రగతి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చింది ఐక్య రాజ్య సమితి.
2015 సంవత్సరాన్ని మహిళా సాధికారత, మానవాళికి సమన్యాయం ఉండాలని, 2016 లో లింగ సమానత్వం కోసం పాటు పడడం,
2017 సంవత్సరాన్ని మహిళలు మారుతున్న పని ప్రపంచంలో అవకాశం కల్పించడం,
2018లో గ్రామీణ, పట్టణ కార్యకర్తలు, మహిళల జీవితాలను మార్చాలని పిలుపునిచ్చింది ఐక్య రాజ్య సమితి.
2019 సంవత్సరాన్ని సమానంగా ఆలోచించండి ..స్మార్ట్ గా రూపొందించండి..మార్పు కోసం ఆవిష్కరించండి అని పిలుపునిచ్చింది.
2020ని నాటి తరానికి సమానత్వం మహిళల హక్కులను గ్రహించడం, 2021 సంవత్సరాన్ని నాయకత్వంలో
మహిళలు భాగస్వామ్యం కల్పించాలని , 2022ను స్థిరమైన రేపటి కోసం ఉద్యమించాలని కోరింది ఐక్య రాజ్య సమితి.
Also Read : మహిళా సాధికారతకు ఆమె దర్పణం