Seethakka Mla : అనసూయ అంటే ఎవరికీ గుర్తుండక పోవచ్చు. కానీ సీతక్క అంటే ఎవరైనా గుర్తు పడతారు. ఎవరైనా సర్పంచ్ అయితే చాలు డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తారు.
కానీ ఆమె ఎమ్మెల్యేగా అయినా సరే సామాన్యురాలిగానే ఉంటారు. ప్రజలతో కలిసి పోతారు.
సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వాలి పోతారు. ఒక రకంగా గిరిజన ప్రాంతంలో సీతక్క అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు.
ఆపద వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే వాలి పోతారు. ముందూ వెనుకా చూసుకోకుండా ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన
ధీర వనిత ఈ సీతక్క. ప్రస్తుతం తెలంగాణలోని ములుగు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆమెకు ఇప్పుడు 50 ఏళ్లు. కానీ అలుపెరుగని రీతిలో ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సీతక్కనుSeethakka Mla) ప్రత్యేకంగా అభినందించారు.
పార్టీలకు అతీతంగా ఆమె చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. ములుగు మండలం జగన్న పేట్ లో 1971 జూలై 9న పుట్టారు సీతక్క. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ.
అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరేందుకు ముందు 15 ఏళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన నక్సలైట్ నాయకురాలు. రెండు సార్లు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కరోనా కష్ట కాలంలో ఆదుకున్నారు. వరదలు వచ్చినప్పుడు బాధితులకు అండగా నిలిచారు. ప్రస్తుతం అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సీతక్క. 1988లో నక్సల్స్ ఉద్యమంలో చేరారు.
10వ తరగతి చదువుతున్న సమయంలో పూలన్ దేవి రచనలు చదివి ప్రేరణ పొందారు. జనశక్తి సీపీఐ ఎంఎల్ లో చేరారు. అణగారిన వర్గాల గొంతుకగా ఉన్నారు. దోపీడిని, పాలకుల దుర్మార్గాన్ని నిరసించారు.
వాటిపై పోరాడారు సీతక్క. వరంగల్ జిల్లాలో జనశక్తి నాయకురాలిగా పని చేశారు. నక్సలైట్ నాయకుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జన జీవన స్రవంతిలో చేరింది. ప్రజా నాయకురాలిగా పేరు తెచ్చుకుంది.
2001లో హైదరాబాద్ లో లా చదివింది. ఆమె పోరాట పటిమను గుర్తించిన చంద్రబాబు నాయుడు సీతక్కకు (Seethakka Mla)పిలిచి టికెట్ ఇచ్చాడు. టీడీపీలో చేరింది సీతక్క. 2004లో ఆ పార్టీ తరపున పోటీ చేసింది.
2009లో గెలిచింది. 2014లో ఓడి పోయంది. టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి చందూలాల్ పై విజయం సాధించింది. ప్రస్తుతం కీలకమైన నాయకురాలిగా పని చేస్తోంది.
Also Read : దీదీ జగమెరిగిన ధీర వనిత