Nandini Reddy : తెలుగు సినిమా రంగంలో పురుషులే ఎక్కువే. వాళ్లదే రాజ్యం. అలాంటి తరుణంలో ఇటీవల మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమదైన గొంతుకను వినిపించేందుకు వస్తున్నారు. మహిళా దర్శకులు చాలా తక్కువ.
వెబ్ సీరీస్ , షార్ట్ ఫిలింలకు ఎక్కువగా ఉన్నప్పటికీ స్ట్రెయిట్ సినిమాల విషయానికి వచ్చే సరికి వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన వాళ్లు మాత్రమే ఉన్నారు.
వారిలో నందినీ రెడ్డి ఒకరు. హైదరాబాద్ లో 1980 మార్చి 4న పుట్టారు.
2011 నుంచి సినీ రంగంలోనే ఉంటూ తనదైన ముద్ర కనబరుస్తూ వస్తున్నారు.
అలా మొదలైంది అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఆమె తండ్రి భరత్ రెడ్డి సీఏగా బెంగళూరులో స్థిరపడ్డారు.
వీరి కుటుంబం చిత్తూరు జిల్లాకు చెందింది. తల్లి రూపారెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన ఆడపడుచు.
సోదరుడు ఉత్తమ్ రెడ్డి హైదరాబాద్ లో రాయలసీమ రుచులు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నారు.
కోటిలోని ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదివారు నందినీ రెడ్డి(Nandini Reddy ). అనంతరం ఢిల్లీలోని జెఎన్ యూలో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో పీజీ చేసింది. విద్యార్థి దశలోనే నాటకాలు, క్రీడలు, వక్తృత్వంలో , క్రికెట్ లో పార్టిసిపేట్ చేసింది.
అదుర్స్ అనే టీవీ టాలెంట్ షోలో జడ్జిగా వ్యవహరించింది. ఓ మిత్రుని ద్వారా గుర్రం గంగరాజు తో పరిచయం అయ్యింది.
అతడి వద్ద దర్శకత్వ విభాగంలో లిటిల్ సోల్జర్స్ కు పని చేసింది. రసూల్ ద్వారా కృష్ణ వంశీకి పరిచయం అయ్యారు.
ఆమెను తన టీంలో చేర్చుకోలేదు. కన్నడ చిత్రం శాంతి శాంతి శాంతిలో చాన్స్ లభించింది. ఆ తర్వాత కృష్ణ వంశీ చంద్రలేఖ మూవీలోకి తీసుకున్నాడు.
తన టీంలో ముఖ్యమైన వ్యక్తిగా మారారు నందినీ రెడ్డి(Nandini Reddy ). చంద్రలేఖ నుంచి అంతః పురం హిందీ వరకు అతడి వద్దనే ట్రావెల్ అవుతూ వచ్చింది.
దీంతో కృష్ణ వంశీ దగ్గుబాటి సురేష్ బాబుకు పరిచయం చేశాడు. సురేష్ ప్రొడక్షన్ లో మూడేళ్ల పాటు పని చేసింది. 2011లో అలా మొదలైంది మూవీ తీసింది.
ఈ సినిమాకు నంది పురస్కారం దక్కింది. ఉత్తమ దర్శకురాలిగా ఫిలిం పేర్ అవార్డు కు ఎంపికైంది. 2013లో జబర్దస్త్ తీసింది. 2016లో కళ్యాణ వైభోగమే నాగ శౌర్యతో తీసింది.
2019లో ఓహ్ బేబి మూవీ తీసింది. ఇందులో సమంత , రావు రమేష్ నాగ శౌర్య నటించారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు నందినీ రెడ్డి.
Also Read : తెలుగు వాకిట సంచలనం అంజలి ప్రత్యేకం