Mahua Moitra : మహూవా మోయిత్రా డైనమిక్ లీడర్ గా పేరొందారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ ను పెంచే పనిలో ఉన్నారు. పార్లమెంట్ లో తనదైన శైలిలో విరుచుకు పడడంలో, మాట్లాడటంలో తనకు తానే సాటి.
టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్నారు. ఒక రకంగా ఆ పార్టీలో ఇప్పుడు ఆమె ఓ ఫైర్ బ్రాండ్(Mahua Moitra) గా ఎదిగారు.
ఎవరికీ తలవంచని మనస్తత్వం ఆమెది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు.
మోదీ సర్కార్ ను ముప్పు తిప్పలు పెడతారు. ప్రజా సమస్యల గురించి నిలదీస్తారు. ఎక్కడా రాజీ పడరు.
అదే ఆమెను నాయకురాలిగా చేసింది. అందుకే ఆమెకు అంతటి ప్రయారిటీ. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు .
1974 అక్టోబర్ 12న జన్మించిన మహూవా మోయిత్రా పలు అంశాలపై మంచి పట్టుంది.
అస్సాం లోని కచార్ జిల్లా లాబాక్ ఆమె స్వస్థలం.ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ లో కొంత కాలం పాటు పని చేశారు.
విస్తృతమైన పట్టుంది వివిధ అంశాలపై. అస్సాంకు చెందిన వారైనప్పటికీ పశ్చిమ బెంగాల్ లో పూర్తి కాలపు రాజకీయ నాయకురాలిగా (Mahua Moitra)ఉన్నారు.
2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ లోని కృష్ణా నగర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించింది.
ఆమె ఈ ఏడాది జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా పని చేశారు.
కోల్ కతాలో ఎకనమిక్స్ , యుఎఎస్ లోని మాసెచూసెట్స్ లో మ్యాథ్స్ ని పూర్తి చేసింది.
న్యూయార్క్ లోని జేపీ మోర్గాన్ కంపెనీలో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా , లండన్ లోని కంపెనీ బ్రాంచ్ లో(Mahua Moitra) పని చేసింది. వాటిని వదులుకుని 2009లో రాజకీయాల్లోకి వచ్చింది.
కాంగ్రెస్ లో ఉన్న ఆమె ఆ తర్వాత టీఎంసీలోకి జంప్ అయ్యింది. 2016లో కరీంపూర్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందింది. 2019లో కృష్ణా నగర్ నుంచి ఎంపీగా విజయం సాధించింది.
శశిథరూర్ నేతృత్వంలోని ఐటీ రంగానికి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యురాలిగా కూడా ఉన్నారు.
Also Read : తెలుగు వాకిట సంచలనం అంజలి ప్రత్యేకం