Priyanka Chaturvedi : శివ సేన గొంతుక ప్రియాంక

ఎక్క‌డా త‌గ్గ‌ని నాయ‌కురాలు

Priyanka Chaturvedi  : దేశ రాజ‌కీయాల‌లో మ‌హిళ‌ల పాత్ర త‌క్కువే ఉన్న‌ప్ప‌టికీ వారు త‌మ‌దైన శైలిలో రాణిస్తున్నారు. ఆయా పార్టీల‌కు సంబంధించి త‌మ గొంతు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ ఉండ‌గా టీఎంసీ నుంచి మోయిత్రా ఉన్నారు.

ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీతో నువ్వా నేనా అని పోట్లాడుతున్న శివ‌సేన పార్టీకి సంజ‌య్ రౌత్ అధికార ప్ర‌తినిధిగా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు జ‌వాబు ఇస్తూ వ‌స్తున్నారు.

అదే స‌మ‌యంలో బీజేపీపై, కేంద్ర స‌ర్కార్ పై నిరంత‌రం నిప్పులు చెరుగుతున్నారు అదే పార్టీకి చెందిన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది(Priyanka Chaturvedi ).

1976 న‌వంబ‌ర్ 19న పుట్టిన ఆమెకు ఇప్పుడు 45 ఏళ్లు. మ‌హారాష్ట్ర నంచి రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

డైన‌మిక్ లీడ‌ర్ గా పేరొందారు. శివ‌సేన‌లో చేర‌క ముందు ప్రియాంక చ‌తుర్వేది కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధుల‌లో ఒక‌రిగా ఉన్నారు.

పొలిటిక‌ల్ లీడ‌ర్ గా కంటే ముందు కాల‌మిస్ట్ గా ఉన్నారు. అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు క‌లిగిన వ్య‌క్తిగా పేరొందారు.

తెహ‌ల్కా, డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ , ఫ‌స్ట్ పోస్ట్ కి కాల‌మిస్ట్ గా కొంత కాలం ప‌ని చేశారు. రెండు స్వ‌చ్చంద సంస్ధ‌ల‌కు ట్ర‌స్టీగా ఉన్నారు.

మ‌హిళ‌ల సాధికార‌త‌, పిల్ల‌ల పౌష్టికాహారం కోసం ప‌ని చేస్తున్నారు.

అంతే కాదు భార‌త దేశంలోని పుస్త‌కాల‌పై టాప్ టెన్ వెబ్ లాగ్ ల‌లో ఒక పుస్త‌క స‌మీక్ష బ్లాగును కూడా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు ప్రియాంక చ‌తుర్వేది(Priyanka Chaturvedi ).

1999లో న‌ర్సీమోంజీ కాలేజ్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఎక‌నామిక్స్ నుండి ప‌ట్టా పొందారు.

అంత‌కు ముందు ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ అయిన ఎంప‌వ‌ర్ క‌న్స‌ల్టెంట్స్ డైరెక్ట‌ర్ గా త‌న కెరీర్ స్టార్ట్ చేశారు.

ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా 10 వేల మంది మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల స‌ర్టిఫికెట్ ప్రోగ్రామ్ లో భాగ‌స్వామిగా కూడా ఉన్నారు.

సంస‌ద్ టీలో మేరీ క‌హానీ అనే ఇంట‌ర్వ్యూ ప్రోగ్రామ్ ను నిర్వ‌హిస్తూ వ‌చ్చారు. ఇటీవ‌లే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2010లో కాంగ్రెస్ లో చేరారు. 2012లో ముంబై నుంచి ఇండియ‌న్ యూత్ కాంగ్రెస్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అయ్యారు.

సోష‌ల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. స్మృతీ ఇరానీ, ప్ర‌ధాని మోదీల‌ను ఆమె టార్గెట్ చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తికి వ్య‌క్తం చేసింది.

ఏప్రిల్ 19న శివ‌సేస‌లో చేరారు. ప‌లు దేశాల‌లో కూడా ప‌ర్య‌టించారు. 2017లో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై నోట్ల ర‌ద్దు ప్ర‌భావంపై ఆమె ప్ర‌సంగానికి ఆద‌ర‌ణ ల‌భించింది.

Also Read : అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం ‘సీత‌క్క‌’

Leave A Reply

Your Email Id will not be published!