Ashwwini Asokana : ఐటీలో మ్యాడ్ స్ట్రీట్ డెన్ సెన్సేష‌న్

అశ్వని అశోక‌న సాధించిన విజ‌యం

Ashwwini Asokana : భార‌త దేశానికి చెందిన మ‌హిళ‌లు అన్ని రంగాల‌లో రాణిస్తున్నారు. ప్ర‌ధానంగా ఐటీ సెక్టార్ లో వారు త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు. చెన్నైకి చెందిన అశ్వ‌ని అశోక‌న (Ashwwini Asokana)మ్యాడ్ స్ట్రీట్ డెన్ ను స్థాపించింది.

త‌న భ‌ర్త చంద్ర‌శేఖ‌ర‌న్ తో క‌లిసి క్లౌడ్ ఆధారిత ప్లాట్ ఫార‌మ్ ద్వారా దీనిని ఏర్పాటు చేసింది. సిలికాన్ వ్యాలీలోని ఇంటెల్ ఇంట‌రాక్ష‌న్ అండ్ ఎక్స్ పీరియ‌న్స్ రీసెర్చ్ ల్యాబ్ లో మొబైల్ ఇన్నోవేష‌న్ టీమ్ కు ఆమె నాయక‌త్వం వ‌హించారు.

ఐటీ సెక్టార్ లో అపార‌మైన అనుభ‌వం ఉంది అశ్వ‌ని అశోక‌న‌కు. ద‌శాబ్దానికి పైగా ఐటీ సెక్టార్ లో అనుభ‌వం పొందారు. ఇదే స‌మ‌యంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ – కృత్రిమ మేధ‌స్సుపై ఆస‌క్తి క‌లిగింది.

అశ్వ‌ని అశోక‌న త‌ల్లిగా, యూఐ డిజైన‌ర్ గా , బిజినెస్ డెవ‌ల‌ప్ మెంట్ ప్ర‌తినిధిగా , ఎథ్నో గ్రాఫ‌ర్ గా, ప్రోగ్రామ్ మేనేజ‌ర్ గా , ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్ గా , ఆర్టిస్ట్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది.

ఫార్చ్యూన్ 40 అండ‌ర్ 40 జాబితాలో అశ్వ‌ని అశోక‌న కు చోటు ద‌క్కింది. ఆమె వోగ్ , టెక్ క్రంచ్ , నిక్కీ , త‌దిత‌ర ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ల‌లో కూడా చోటు సంపాదించింది.

మ్యాడ్ స్ట్రీట్ డెన్ – మ్యాడ్ అనేది ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ , కంప్యూట‌ర్ విజ‌న్ కంపెనీ. బిలియ‌న్ల మంది ప్ర‌జ‌ల ఉప‌యోగం కోసం మేధ‌స్సు న‌మూనాల‌ను రూపొందించ‌డం ఈ కంపెనీ ప‌ని.

ఇవాళ మ్యాడ్ బృందంతో క‌లిసి ఫ్యాష‌న్ ప‌రిశ్ర‌మ‌లో విప్లవాత్మ‌క మార్పులు వ‌చ్చేలా చేసింది. ఈ కంపెనీని 2013లో ఏర్పాటు చేసింది అశ్వ‌ని అశోక‌న‌.

ఇందులో గ్లోబ‌ల్ బ్రెయిన్ కార్పొరేష‌న్ , సీక్వోయి క్యాపిట‌ల్ , ఫాల్క‌న్ ఎడ్జ్ క్యాపిట‌ల్ , కేడీడీఐ , అర్రె వెంచ‌ర్స్ భారీగా పెట్టుబ‌డులు పెట్టాయి.

Also Read : రైతు పోరాటం మ‌హిళ‌లు కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!