Chitra Gurnani Daga : ఎలాంటి వ్యాపార అనుభవం లేక పోయినా వాళ్లు అనుకున్నది సాధించారు. కలలకు రెక్కలు తొడిగారు. చిత్ర గుర్నాని దాగా తన భర్త అభిషేక్ దాగాతో కలిసి థ్రిల్లోఫిలియాను స్థాపించారు.
ఆమె ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్వ విద్యార్థి. వ్యాపారం పట్ల ఆమెకు ఉన్న అభిరుచి కారణంగా ఎలాంటి ముందస్తు అనుభవం లేకుండానే ప్రారంభించింది. చిత్ర గుర్నాని(Chitra Gurnani Daga) దాగా కుటుంబంలో కానీ భర్త కుటుంబంలో కానీ ఎవరూ వ్యాపారం లో లేరు.
కానీ వారు తామిద్దరి కలలను అసాధారణమైన రీతిలో సాకారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె నిరంతరం ప్రయాణం చేయడం , ఇతరుల కలలను నిర్మించడం పట్ల ఆమెకు ఉన్న అభిరుచికి దారి తీసింది.
తన శక్తియుక్తులకు మెరుగులు పెట్టింది. అభిరుచి ఉన్న నిపుణులను నియమించుకుంది. ఆ ఆలోచనలోంచి వచ్చిందే థ్రిల్లోఫిలియా కంపెనీ. ఇది భారతీయ అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీ.
ఇది ప్రత్యేకమైన ఆఫ్ బీట్ ప్రయాణ కథనాల కోసం స్థానిక అనుభవాలను క్యూరేట్ చేస్తుంది. ఇవాళ నాలుగు మిలియన్ల నెల వారీ వినియోగదారులతో ప్రయాణ అనుభవాల కోసం అతి పెద్ద ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ లలో ఒకటిగా మారింది.
యాక్టివ్ వెబ్ సైట్ , బ్లాగ్ , సోషల్ మీడియాతో థ్రిల్లోఫిలియా తనకంటూ ఓ బ్రాండ్ పేరును నిర్మించు కోగలిగింది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ప్రసిద్ద ట్రావెల్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది.
న్యూ వెంచర్స్ , కిషోర్ గంజి, హైదరాబాద్ ఏంజెల్స్ , నవ్ లోక్ వెంచర్స్ ఇన్వెస్ట్ చేశాయి.
Also Read : రుతుక్రమంపై ‘అదితి’ అవగాహన