Divya Gokulnath : బైజూస్ కు ఆమె ఓ ఐకాన్

ఇండియాలో నెంబ‌ర్ వ‌న్

Divya Gokulnath : ఎవ‌రీ దివ్య గోకుల్ నాథ్ అనుకుంటున్నారా. భార‌త దేశంలో అతి పెద్ద ఎడ్యూకేష‌న‌ల్ ప్లాట్ ఫార‌మ్ గా పేరొందిన బైజూజ్ సంస్థ కో ఫౌండ‌ర్. ఆమె ఆర్వీ కాలేజీ నుంచి ఇంజ‌నీరింగ్ డిగ్రీ పూర్తి చేసింది.

బైజు ర‌వీంద్ర‌న్ క్లాసులో అత‌ని విద్యార్థిగా చేరింది. ఆ త‌ర్వాత టీచ‌ర్ గా మారింది. అనంత‌రం ర‌వీంద్ర‌న్ ను పెళ్లి చేసుకుంది.

ప్లాట్ ఫార‌మ్ ను ప్రారంభించే స‌మ‌యంలో దివ్య గోకుల్ నాథ్(Divya Gokulnath) బైజూస్ ను ఎంచుకుంది.

ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన ఎడ్యుకేష‌న‌ల్ టెక్ కంపెనీగా పేరొందింది. దివ్య 2019లో లింక్డిన్ టాప్ వాయిస్ ల‌లో ఒక‌రుగా నిలిచారు.

బైజూస్ జేఈఈ, కాట్ , నీట్ , ఐఏఎస్ వంటి ప‌రీక్ష‌ల కోసం , 1 నుంచి 12 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు యాప్ , వెబ్ సైట్ ద్వారా నేర్చు కోవ‌డానికి మెటీరియ‌ల్ అందిస్తుంది.

పాఠాలు కూడా చెబుతుంది. 2015లో 4 నుంచి 12 త‌ర‌గ‌తుల‌కు త‌న ప్లాగ్ షిప్ ఉత్పత్తి చేస్తుంది. బైజూస్ ది లెర్నింగ్ యాప్ ను ప్రారంభించింది.

ఇవాళ ఈ యాప్ ను 42 మిలియ‌న్ల మందికి పైగా న‌మోదితుల‌య్యారు. 3 మిలియ‌న్ల‌కు పైగా వార్షిక చెల్లింపు స‌భ్య‌త్వాలు ఉన్నాయి. స‌గ‌టున ఒక విద్యార్థి ప్ర‌తి రోజూ స‌గటున 71 నిమిషాలు యాప్ లో గ‌డుపుతుండ‌డం విశేషం.

విజువ‌ల్ పాఠాల ద్వారా స‌ర‌దాగా నేర్చు కోవ‌డం కోసం యాప్ రూపొందించారు. ఒక‌టి నుంచి మూడు త‌ర‌గ‌తుల‌కు కూడా పాఠాలు చేర్చింది బైజూస్.

ఇక స‌ద‌రు ఎడ్ టెక్ కంపెనీకి చాన్ జుక‌ర్ బ‌ర్గ్ ఇనిషియేటివ్ , సోఫినా , వెర్లిన్ వెస్ట్ , ఐఎఫ్‌సీ , ఆరిన్ క్యాపిట‌ల్స్ , టైమ్స్ ఇంట‌ర్నెట్ , లైట్ స్పీడ్ వెంచ‌ర్స్

, టైగ‌ర్ గ్లోబ‌ల్ , జ‌న‌ర‌ల్ అట్లాంటిక్ , టెన్సెంట్ , సీక్వోయి క్యాపిట‌ల్ , గుడ్ల గూబ వెంచ‌ర్స్ , నాస్ప‌ర్స్ , సీపీఐబి వంటి అనేక కంపెనీలు కంపెనీకి మ‌ద్ద‌తు ఇస్తున్నాయి.

బైజూస్ బీసీసీఐ క్రికెట్ జ‌ట్టుకు అధికారిక స్పాన్స‌ర్ గా ఉంటోంది.

Also Read : ఐటీలో మ్యాడ్ స్ట్రీట్ డెన్ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!