Bismah Maroof : ఎవరీ బిస్మా మరూఫ్ అనుకుంటున్నారా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ 2022 లో భాగంగా అద్భుతమైన ఆట తీరుతోనే కాదు వ్యక్తిత్వంతో కూడా ఆకట్టుకున్నారు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మహిళా కెప్టెన్.
మాతృత్వంలో ఉన్న గొప్పదనాన్ని మరోసారి చాటింది. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.
ఆసిస్ తో పాకిస్తాన్ స్కిప్పర్ బిస్మా మరూఫ్ (Bismah Maroof)78 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ సాధించాక తను ప్రాణపదంగా ప్రేమించే తన ఆరు నెలల కూతురు ఫాతిమాను చూసి ఊయల సంజ్ఞ చేసింది.
ప్రస్తుతం బిస్మా మరూఫ్ హాట్ టాపిక్ గా మారారు. నెట్టింట్లో వైరల్ గా మారింది. గెలుపు ఓటములు పక్కన పెడితే బిస్మా చేసిన ఆ పనికి లక్షలాది కళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాయి.
వందలాది కెమేరాలు క్లిక్ మని అనిపించాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా బిస్మా మరూఫ్ కు క్రీడా లోకం యావత్ ఫిదాగా మారి పోయింది. హాఫ్ సెంచరీ సాధించాక తన కూతురు వైపు చూస్తూ ఈ రన్స్ అంకితం ఇస్తున్నట్లు ప్రకటించింది.
అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం రోజున మహిళలందరికీ డెడికేట్ చేస్తున్నట్లు వెల్లడించింది బిస్మా మరూఫ్.
ఇదిలా ఉండగా ప్రపంచ కప్ ప్రారంభం అయ్యాక దాయాది ఇండియా జట్టుతో జరిగిన మ్యాచ లో ఓడి పోయిన అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
భారతీయ మహిళా క్రికెటర్లు బిస్మా మరూఫ్ కూతురుతో ఆడుకున్నారు. సెల్ఫీ కూడా తీసుకున్నారు. వరల్డ్ వైడ్ గా హల్ చల్ గా మారింది.
Also Read : బైజూస్ కు బీసీసీఐ లైన్ క్లియర్