Hema Malini ;ప్రముఖ బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు హేమ మాలిని(Hema Malini )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన యూపీ ఎన్నికల్లో రెండోసారి యోగి సారథ్యంలో బీజేపీ అధికారం దిశగా దూసుకు పోతుండడంపై స్పందించారు.
అవినీతి, అక్రమార్కులే కాదు నేరస్తుల గుండెల్లో ఇక నుంచి రైళ్లు పరుగెత్తించేందుకు రెడీ అవుతారంటూ యోగిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇక బుల్డోజర్లు మరోసారి ప్రయోగిస్తారంటూ స్పష్టం చేశారు.
ఈ అపురూపమైన విజయం సీఎం యోగి పాలన పనితీరుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలలో 202 స్థానాలు సాధించాల్సి ఉంటుంది బీజేపీ.
ఆ మార్క్ ను దాటేసి దూసుకు పోతోంది బీజేపీ. తొలిసారిగా యోగి ఆదిత్యానాథ్ ఈసారి జరిగిన ఎన్నికల్లో బరిలోకి దిగారు. రైతులు, నిరుద్యోగుల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడినప్పటికీ మోదీ త్రయం మార్క్ దెబ్బకు కాషాయం జెండా రెప రెప లాడుతోంది.
మథుర నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగుర వేశాక హేమమాలిని ఆనందం వ్యక్తం చేశారు. బుల్ డోజర్ ముందు ఏదీ రాదన్నారు. ప్రజలు పని చేసే వాళ్లకు మరోసారి పట్టం కట్టారని అన్నారు.
తమ ప్రభుత్వం మరోసారి పవర్ లోకి వస్తుందని తమకు ముందే తెలుసన్నారు. ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. చివరి దాకా ఎస్పీ గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు. కానీ 112 స్థానాలకే పరిమితమైంది.
బీఎస్పీ, కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలు బరిలో ఉన్నా ఎలాంటి ప్రభావం చూపలేక పోయాయి. ప్రియాంక గాంధీకి , కాంగ్రెస్ పార్టీకి ఇది బిగ్ షాక్ .
Also Read : పని చేయని ప్రియాంక చరిష్మా