Uttarakhand Election : భారత దేశంలో దేవుళ్లు నడయాడిన నేలగా ఉత్తరాఖండ్ కు(Uttarakhand Election) పేరుంది. దానికి మరో పేరు దైవ భూమి. మరోసారి భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది.
ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపు ఫలితాల్లో ఉత్తరాఖండ్ లో 70 స్థానాలకు గాను 47 స్థానాలను భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకుని సత్తా చాటింది. తాజాగా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగగా. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది.
అక్కడ అన్ని పార్టీలను చీపురుతో ఊడ్చేసింది. గోవాలో కూడా సత్తా చాటింది. ఇక కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి హరీష్ రావత్ అన్నీ తానై వ్యవహరించారు.
కానీ ఆ పార్టీని గట్టెక్కించ లేక పోయారు. ఆ పార్టీకి కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇతరులు 4 సీట్లతో సరి పెట్టుకున్నారు. దీంతో పుష్కర్ సింగ్ ధామీ మరోసారి దైవ భూమి అయిన ఉత్తరాఖండ్ సీఎంగా కొలువు తీర బోతున్నారు.
ఈ మొత్తం ఎన్నికలలో ప్రధాని మోదీ తన మార్క్ ను చాటారు. యూపీలో, ఉత్తరాఖండ్ లో , మణిపూర్ లో , గోవాలో సైతం బీజేపీ తన పవర్ ను నిలబెట్టుకుంటోంది. స్పష్టమైన మెజారిటీని సాధించడంతో తమ ఓటమిని అంగీకరిస్తున్నట్లు హరీష్ రావత్ ప్రకటించారు.
విచిత్రం ఏమిటంటే ఈ ఎన్నికల్లో హరీష్ రావత్ ఓటమి పాలయ్యారు. ఇది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఇక సీఎంగా బరిలో ఉన్న పుష్కర్ సింగ్ ధామీ సైతం పరాజయం పాలు కావడం విశేషం.
Also Read : పంజాబ్ లో ఆప్ అఖండ విజయం