N Biren Singh : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగానే వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో కొలువుతీరింది. మొత్తంగా కాంగ్రెస పార్టీ పూర్తిగా చతికిల పడింది.
ఇక ఉత్తరాఖండ్ లో ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావత్ ఓడి పోయాడు. అక్కడ సీఎం గా ఉన్న పుష్కర్ సింగ్ ధామీని కూడా ప్రజలు తిరస్కరించారు. కానీ బీజేపీకి పట్టం కట్టారు.
ఈ ఎన్నికలు తమకు సెమీ ఫైనల్ లాంటివన్నారు ప్రధాని మోదీ. తమ పనితీరుకు రెఫరెండమ్ గా భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో ఫలితాలు సైతం ఆశించిన దాని కంటే మరోసారి నాలుగు రాష్ట్రాలలో కాషాయం జెండా రెప రెప లాడుతోంది.
ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్ , మణిపూర్ , గోవాలలో తిరిగి బీజేపీ పవర్ లోకి రానుంది. ఇక మణిపూర్ రాష్ట్రంలో ప్రకటించిన ఫలితాలను బట్టి చూస్తే మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంది ఇక్కడ బీజేపీ. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 32 స్థానాలను కైవసం చేసుకుంది.
ఇతరులు 11 చోట్ల గెలుపొందారు. ఎన్పీపీ 8 చోట్ల , కాంగ్రెస్ నాలుగు చోట్ల విజయం సాధించింది. ఎన్పీఎఫ్ 4 చోట్ల విజయం సాధించింది.
ప్రస్తుతం సీఎంగా ఉన్న బీరేన్ సింగ్ హీంగాంగ్ (N Biren Singh)నుంచి తన ప్రత్యర్థి పై 18 వేల 271 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ తన మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ సహాయం తీసుకోక పోవచ్చని అంచనా.
ఇక బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్ , నేషనల్ పీపుల్స్ పార్టీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు లభించింది.
Also Read : దైవ భూమిలో ధామిదే రాజ్యం