KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇవాళ ఆయన యాదాద్రిలో పర్యటించాల్సి ఉంది. ఈ టూర్ ను అనారోగ్య కారణంగా రద్దు చేసుకున్నారు.
హుటా హుటిన నగరంలోని యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కేసీఆర్ (KCR )వెంట భార్య శోభ , కూతురు కల్వకుంట్ల కవిత, సంతోష్ రావు, తదితరులు ఉన్నారు. విషయం తెలుసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరా తీశారు.
ఇక ఆస్పత్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు వెంటనే ఆస్పత్రి వైద్యులు సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్ , ఇతర వైద్య పరీక్షలు చేశారు. గత రెండు రోజుల నుంచి కేసీఆర్ కొంత పల్చబడ్డారని, ఎడమ చేయి లాగుతోందంటూ తెలిపారని యశోద ఆస్పత్రి డాక్టర్ ఎం.వీ. రావు వెల్లడించారు.
ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా యాదాద్రి టూర్ ను సీఎం అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. దీంతో కేసీఆర్ తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరవుతారని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం తరపున లక్ష్మీ నరసింహ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇదిలా ఉండగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు యాదాద్రికి సమర్పించారు.
కళ్యాణోత్సవం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. కాగా ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు పరీక్షలు చేశాక ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు వైద్యులు.
విపరతమైన ఒత్తిడికి లోనైనప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
Also Read : 11,103 మంది కాంట్రాక్ట్ జాబ్స్ రెగ్యులరైజ్