YS Jagan : కేబినెట్ విస్త‌ర‌ణ‌పై ఉత్కంఠ

ఉండేది ఎవ‌రు ఊడేది ఎవ‌రో

YS Jagan : ఏపీ సీఎం జగ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే కేబినెట్ విస్త‌ర‌ణ ఉండ‌నుందంటూ ప్ర‌క‌టించారు. కొలువు తీరి మూడు ఏళ్లు కావ‌స్తోంది. ప‌లు కీల‌క కార్పొరేష‌న్ ప‌ద‌వులు కూడా ఖాళీగా ఉన్నాయి.

ఇటీవ‌లే కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణం చెందారు.

ఆయ‌న‌కు చెందిన కీల‌క శాఖ‌ల‌ను ప‌లువురు మంత్రుల‌కు కేటాయించారు సీఎం.

దీంతో ఒక్కో మంత్రి వ‌ద్ద ప‌లు శాఖ‌లు ఉండ‌డం వ‌ల్ల పాల‌నా ప‌రంగా ఇబ్బందులు త‌లెత్త‌నున్నాయి.

ఉగాది వ‌ర‌కు కొత్త జిల్లాలు రానున్నాయి. దీంతో ఇంకా ప‌ని భారం పెరుగుతుంది.

వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకుని సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

సీనియ‌ర్ మంత్రుల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించి జూనియ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ప‌ద‌వులు కోల్పోయిన వారంతా పార్టీ కోసం ప‌ని చేయాల‌ని ఇప్ప‌టికే సీఎం(YS Jagan ) ఆదేశించారు కేబినెట్ భేటీ సందర్భంగా.

ఉన్న కేబినెట్ లో ఐదు లేదా ఆరు మంది త‌ప్పా మిగ‌తా వారిని ప‌క్క‌న పెట్టే ఛాన్స్ ఉన్న‌ట్లు టాక్.

ఇప్ప‌టికే జ‌గ‌న్ క్లియరెన్స్ ఇవ్వ‌డంతో ఆశావ‌హులలో ఆస‌క్తి పెరిగింది.

జిల్లాల వారీగా చూస్తే క‌ర్నూలు జిల్లా నుంచి ఆర్త‌ర్ , బాల నాగి రెడ్డి, సాయి ప్ర‌సాద్ రెడ్డి, శిల్పా చ‌క్ర పాణి రెడ్డి ఉన్నారు.

అనంత‌పురం జిల్లా నుంచి ఉషాశ్రీ చ‌ర‌ణ్, ప‌ద్మావ‌తి, వెంక‌ట్రామి రెడ్డి, రామ‌చంద్రా రెడ్డి వేచి చూస్తున్నారు.

క‌డ‌ప నుంచి శ్రీ‌కాంత్ రెడ్డి, శ్రీ‌నివాసులు, చిత్తూరు జిల్లా నుంచి భాస్క‌ర్ రెడ్డి, క‌రుణాక‌ర్ రెడ్డి, రోజా ఆశిస్తున్నారు.

ఇక గుంటూరు జిల్లా నుంచి ముస్తాఫా, రాజ‌శేఖ‌ర్ , ర‌జ‌ని, రాంబాబు, రామ‌కృష్ణా రెడ్డి, ఆళ్ల ఉన్నారు. కృష్నా జిల్లా నుంచి ఉద‌య భాను, విష్ణు, పార్థ సార‌థి, జోగి ర‌మేష్ లైన్ లో ఉన్నారు.

తూర్పు గోదావ‌రి నుంచి చిట్టి బాబు, స‌తీష్ , రాజా, దాడి శెట్టి ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి ముత్యాల నాయుడు, ధ‌ర్మ‌శ్రీ‌, అమ‌ర్ నాథ్ ఉండ‌గా శ్రీ‌కాకుళం నుంచి ధ‌ర్మాన ప్ర‌సాద్ , త‌మ్మినేని ఉన్నారు.

Also Read : దేశం చూపు ‘ఖ‌ట్క‌ర్ క‌లాన్’ వైపు

Leave A Reply

Your Email Id will not be published!