PAYTM CEO : పేటీఎం ఫౌండర్ , సిఇఓ విజయ్ శేఖర్ శర్మ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఆయనను బెయిల్ పై విడుదల చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారం ఫిన్ టెక్ వర్గాలలో తీవ్ర ఆసక్తిని, ఉత్కంఠను రేపింది.
ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ సుమన్ నల్వా సిఇఓ అరెస్ట్ వ్యవహారంపై స్పందించారు. విజయ్ శేఖర్ శర్మ(PAYTM CEO )తన ల్యాండ్ రోవర్ కారులో వస్తుండగా డీసీపీ బెనిటా మేరీ జాకర్ ను ఢీకొట్టారు. అక్కడి నుంచి వెళ్లి పోయారు.
ఈ ఘటనలో ఆయన కనీస బాధ్యతగా కూడా తమకు చెప్పలేదన్నారు. వెంటనే ఢీకొట్టిన కారు నెంబర్, విజయ్ శేఖర్ శర్మను గుర్తించామన్నారు.
ఈ విషయాన్ని తమకు డీసీపీ కారును డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ తో పాటు కానిస్టేబుల్ దీపక్ కుమార్ ల్యాండ్ రోవర్ కారు నంబర్ ను గుర్తించి తమకు సమాచారం అందించారని చెప్పారు.
వెంటనే ఆ ల్యాండ్ రోవర్ కారు పేటీఎం సిఇఓ విజయ్ శేఖర్ శర్మదని గుర్తించామన్నారు. ప్రాథమిక విచారణ తర్వాత రోవర్ కారును గుర్గావ్ లోని ఒక కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు , ఆ కారు ఢిల్లీలో ఉంటున్న విజయ్ శేఖర్ శర్మదేనని నిర్దారణకు వచ్చామన్నారు.
రూల్స్ కు విరుద్దంగా కారు నడపటమే కాకుండా డీసీపీ కారు డ్యామేజ్ చేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆ మేరకు విజయ్ శేఖర్ శర్మను అరెస్ట్ చేశామని, ఆయన బెయిల్ పై విడుదలయ్యారని తెలిపారు.
Also Read : క్యాబ్ డ్రైవర్ గా మారిన సిఇఓ