Gutta Sukhender Reddy : శాసనమండలి చైర్మన్ పదవికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసులో సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy )నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా శాసనమండలి చైర్మన్ గా రెండోసారి ఛాన్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో చైర్మన్ పదవి ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీలకు చెందిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో లాగానే తాను శాసనమండలి హుందాతనంగా నడిపించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటా కింద శాసనమండలికి గుత్తా కు ఎమ్మెల్సీ గా రెండోసారి ఎన్నికయ్యారు.
కాగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. మండలి చైర్మన్ పదవి ఎన్నికకు సంబంధించి ఈనెల 12న షెడ్యూల్ విడుదలైంది.
అయితే 2019 సెప్టెంబర్ 11న మొదటి సారిగా గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అధికార పక్షంతో పాటు విపక్షాలకు చెందిన సభ్యులకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాడు.
2021 జూన్ మొదటి వారం దాకా గుత్తా మండలి చైర్మన్ గా ఉన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో కేసీఆర్ ప్రొటెం చైర్మన్ గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు.
ప్రస్తుతం మండలి ప్రొటెం చైర్మన్ గా సయ్యద్ జాఫ్రీ కొనసాగుతున్నారు.
Also Read : డిప్యూటీ స్పీకర్ వర్సెస్ ఎమ్మెల్యే