Ajay Mishra : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra)తనయుడు ఎన్నికల సమయంలో బెయిల్ పై విడుదలయ్యాడు.
దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎన్నికల సందర్భంగా మంత్రి భారీ భద్రత నడుమ ఓటు హక్కు వినియోగించారు. తాజాగా యూపీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 273 సీట్లు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party).
ఈ సందర్భంగా ఇవాళ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశారు. లఖింపూర్ ఖేరి ఘటన ఈ ఎన్నికలపై ప్రభావం చూపలేదన్నారు.
లా అండ్ ఆర్డర్ బాగుందని, అందుకే తమకు లఖింపూర్ ఖేరి ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలలో బీజేపీ కైవసం చేసుకుందని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒక వేళ శాంతి భద్రతలు బాగా లేక పోయి ఉండి ఉంటే తాము విజయం సాధించి ఉండే వాళ్లం కాదన్నారు. లఖింపూర్ ఖేరి కేసులో తన కొడుకు తప్పేమీ లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.
విచిత్రం ఏమిటంటే విపక్షాలతో పాటు రైతు సంఘాల నేతలు పెద్ద ఎత్తున అజయ్ మిశ్రా, ఆశిశ్ మిశ్రాలపై ఆరోపణలు చేశారు. తన కేంద్ర మంత్రి (union minister) పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కానీ పట్టించు కోలేదు. ప్రధాని మోదీ, సీఎం యోగి నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం మళ్లీ పవర్ లోకి వస్తుందని తాను ఇంతకు ముందే చెప్పానన్నారు.
Also Read : మోదీ నినాదాలతో దద్దరిల్లిన లోక్ సభ