Sunil Jakhar : మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు సునీల్ జాఖఢ్(Sunil Jakhar) . ఆయనను ఎంపిక చేసి పూర్తిగా తప్పు పని చేసిందన్నారు.
ఆయన పార్టీకి దక్కిన ఆస్తి కాదంటూ పూర్తిగా భారం మారారంటూ ఆరోపించారు. చన్నీని సీఎంగా ప్రకటించడమే పార్టీ చేసిన అతి పెదద్ తప్పు అంటూ మండిపడ్డారు. ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
చన్నీ పార్టీకి ఆస్తి కాదని మోయలేని భారంగా మారి పార్టీని కోలుకోలేకుండా చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. చన్నీ పూర్తిగా తన స్వార్థం చూసుకున్నాడని, తీరా ఎన్నికల సమయం వచ్చే సరికల్లా పార్టీ పీకల లోతు కూరుకు పోయిందన్నారు సునీల్ జాఖఢ్(Sunil Jakhar) .
దీంతో ప్రజలు నమ్మలేని స్థితికి చేరుకున్నారని తెలిపారు. దీంతో గతంలో ఉన్నన్ని సీట్లలో పూర్తిగా కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ చన్నీ మేనల్లుడి ఇంట్లో దాడులు చేసి ఏకంగా రూ. 10 కోట్లు స్వాధీనం చేసుకోవడం పార్టీని సర్వ నాశనం చేసిందని ఫైర్ అయ్యారు.
చన్నీని ప్రకటించిన రోజే సునీల్ జాఖడ్ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. విచిత్రం ఏమిటంటే సీఎం చన్నీ పోటీ చేసిన చామ్ కౌర్ సాహిబ్, భదౌర్ రెండు నియోజకవర్గాలలో ఘోరంగా ఓటమి పాలయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Also Read : అజయ్ మిశ్రా సంచలన కామెంట్స్