Amarinder Singh : గాంధీ ఫ్యామిలీ వ‌ల్ల‌నే ఓట‌మి

మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్

Amarinder Singh  : మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. నిన్న‌టి దాకా సిద్దూపై నిప్పులు చెరిగిన ఈ నేత ఉన్న‌ట్టుండి పంజాబ్ లో కాంగ్రెస పార్టీకి త‌నను బాధ్యుడిని చేయ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తో కూడిన గాంధీ ఫ్యామిలీ తీరు వ‌ల్ల‌నే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయింద‌ని ఆరోపించారు.

అమ‌రీంద‌ర్ సింగ్ 9 సంవ‌త్స‌రాల పాటు పంజాబ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ల్యాండ్, సాండ్ మాఫియాతో పాటు అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింది.

దీంతో పార్టీ గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని కోరింది. చివ‌ర‌కు కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ (Amarinder Singh )సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు.

ఆ వెంట‌నే ఢిల్లీలో అమిత్ షా, ప్ర‌ధాని మోదీని క‌లిశారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నిక‌ల కంటే ముందు కెప్టెన్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకున్నారు. త‌న సీటుతో పాటు ఏ ఒక్క సీటు గెల‌వ‌లేక పోయారు. త‌న‌కు ప‌ట్టు క‌లిగిన‌, కంచుకోట‌గా భావించిన పాటియాల‌లో ఘోరంగా ఓట‌మి పాల‌య్యారు.

ఆయ‌న‌తో పాటు సీఎం చ‌ర‌ణిజ్ సింగ్ చ‌న్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ, శిరోమ‌ణి అకాలీద‌ళ్ నేత‌లు ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ , మ‌జిథియా, సోనూ సూద్ సిస్ట‌ర్ ఇంటి బాట ప‌ట్టారు.

ఈ త‌రుణంలో కెప్టెన్ ను సీఎంగా కొన‌సాగించి త‌ప్పు చేశాన‌ని సాక్షాత్తు సోనియా గాంధీ పేర్కొన‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. దీనిపై కెప్టెన్ స్పందించారు. తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : చిత్రా రామ‌కృష్ణ క‌స్ట‌డీ పొడిగింపు

Leave A Reply

Your Email Id will not be published!