Shree Saini : ఎవరీ శ్రీ సైనీ (Shree Saini) అనుకుంటున్నారా. మిస్ వరల్డ్ 2021 (Miss World 2021) కిరీటాన్ని తృటిలో కోల్పోయింది. రన్నరప్ గా నిలిచింది. కానీ అంతకు ముందు ఆమె ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది.
ఇంతకూ ఈ శ్రీ సైనీ(Shree Saini )జీవితం గురించి తెలుసుకుంటే కన్నీళ్లు రాక మానవు. ఆమె ప్రవాస భారతీయురాలు. అమెరికాలో స్థిర పడ్డారు. శ్రీ సైనీ వయసు 26 ఏళ్లు.
పంజాబ్ స్వస్థలం. మిస్ వరల్డ్ అమెరికా (Miss World America) టైటిల్ కూడా గెలుపొందింది. మిస్ ఇండియా 2017-2018కు ఎంపికైంది.
2018-19లో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ వైడ్ లో పోటీదారుగా ఎంపికైంది.
2019లో వాషింగ్టన్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొంది.
12 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.
ఒకానొక సమయంలో ఆమె చావు వద్దకు వెళ్లి వచ్చింది. ముఖం గుర్తు పట్టలేనంతగా తయారైంది.
శ్రీ సైనీ(Shree Saini )ఓడి పోలేదు. భయపడలేదు. అధైర్య పడలేదు.
గుండె కూడా పని చేయని పరిస్థితి నెలకొన్న సమయంలో శ్రీ సైని దానిని అధిగమించింది.
తట్టుకుని నిలబడింది. కృత్రిమ గుండె సాయంతో ప్రస్తుతం అందాల పోటీల్లో పాల్గొంది.
శ్రీ సైని 1996 జనవరి 6న ఇండియాలోని పంజాబ్ లోని లూథియానాలో పుట్టారు.
గత ఐదు సంవత్సరాల నుంచి యూఎస్ఏలో నివసిస్తున్నారు. చిన్నతనంలో పేదరికాన్ని చవి చూసింది.
ఆమె డ్యాన్సులో కూడా ప్రావీణ్యం సంపాదించింది. తను ఇక ఆడలేవన్నారు వైద్యులు. కానీ చేసి చూపించింది. కారు ప్రమాదంలో కోలుకునేందుకు ఏడాది పడుతుందన్నారు.
కానీ రెండు వారాల తర్వాత తన క్లాసులకు తిరిగి అటెండ్ అయ్యింది. వాషింగ్టన్ యూనివర్శిటీలో డిగ్రీ చదివారు. మిస్ వాషింగ్టన్ వరల్డ్ గా 2020లో విజేతగా ఎంపికైంది.
బ్యూటీ విత్ ఎ పర్పస్ నేషనల్ అంబాసిడర్ గా ఉన్నారు. 100కు పైగా లాభాపేక్ష లేని సంస్థలతో న్యాయవాదిగా పని చేస్తోంది శ్రీ సైనీ(Shree Saini ).
ఇదే ఏడాది ఫ్యాషన్ విస్టా నుండి వరల్డ్ పీస్ మెసెంజర్ అవార్డు అందుకుంది.
2021 అక్టోబర్ 2న మిస్ వరల్డ్ అమెరికాగా (Miss World America) ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ 2021 (Miss World 2021) కి గాను రన్నరప్ గా నిలిచి చరిత్ర సృష్టించింది శ్రీసైనీ. అత్యంత ప్రభావిత వ్యక్తుల విజేతగా కూడా నిలిచింది.
పీపుల్స్ ఛాయిస్ విజేతగా ఉన్నారు. టాలెంట్ టాప్ 10 ఫైనలిస్ట్ గా ఉన్నారు. టాలెంట్ ఆడియన్స్ ఛాయిస్ గా నిలిచారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఛాలెంజ్ జాతీయ విజేతగా ఎంపికయ్యారు.
టాప్ మోడల్ 1వ రన్నరప్ గా ఉన్నారు. టాలెంట్ ఒకటవ రన్నరప్ గా నిలిచారు శ్రీ సైనీ (Shree Saini) . కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడింది శ్రీసైనీ. ఆమె జీవితం ఆదర్శం.
అందం వెనుక అసాధారణమైన ప్రయాణం ఉంది. అంతకంటే దుఖఃం కూడా ఉంది. విజేతలుగా నిలిచేందుకు కావాల్సింది పట్టుదల మాత్రమే.
Also Read : మాస్ లీడర్ భగవంత్ మాన్