Ghulam Nabi Azad : స‌మ‌సిన వివాదం క‌లిసి ప్ర‌యాణం

సోనియాతో ముగిసిన ఆజాద్ భేటీ

Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో అస‌మ్మ‌తి స్వ‌రాన్ని వినిపిస్తూ , నాయ‌క‌త్వం వ‌హిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం న‌బీ ఆజాద్(Ghulam Nabi Azad )ఇవాళ భేటీ అయ్యారు.

తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓట‌మి పాలైంది. దీనికి బాధ్య‌త వ‌హిస్తూ వెంట‌నే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు త‌మ ప‌ద‌వుల నుంచి త‌ప్పు కోవాల‌ని డిమాండ్ చేశారు జీ-23 కు చెందిన సీనియ‌ర్లు.

గ‌త ఆదివారం ఢిల్లీలో జ‌రిగిన సీడ‌బ్ల్యూసీలో లేవనెత్తారు. తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఆజాద్ (Ghulam Nabi Azad )నివాసంలో గాంధీ ఫ్యామిలీని వ్య‌తిరేకిస్తున్న నాయ‌కులు క‌పిల్ సిబ‌ల్ , శ‌శి థ‌రూర్, మ‌నీశ్ తివారీ, భూపీంద‌ర్ సింగ్ హూడా, త‌దిత‌ర నాయ‌కులు స‌మావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా క‌లిసి న‌డ‌వాల‌ని, స‌మిష్టి నాయ‌క‌త్వం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌డ‌తుంద‌ని సూచించారు. దీంతో అస‌మ్మ‌తి నాయ‌కులు వ‌త్తిడి మేర‌కు సోనియా గాంధీ దిగి వ‌చ్చారు.

ఈ మేర‌కు ఆమెనే గులాం న‌బీ ఆజాద్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆజాద్ ఇవాళ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. గంట‌కు పైగా వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. 5 రాష్ట్రాల ఎన్నిక‌ల స‌ర‌ళిపై మాట్లాడారు.

పార్టీలో నాయ‌క‌త్వం మార్పుపై జీ23 స‌భ్యులు ఏమ‌ని అనుకుంటున్నారో కూడా తెలిపారు. పార్టీని మ‌రింత ప‌టిష్టం చేసేందుకు సూచ‌న‌లు ఇచ్చామ‌న్నారు గులాం న‌బీ ఆజాద్.

2024 ఎన్నిక‌ల‌కు సిద్దం కావాల‌ని నిర్ణయించామ‌న్నారు. ప్ర‌స్తుతానికి పార్టీకి మేడం జీ నాయ‌త్వం వ‌హిస్తార‌ని చెప్పారు.

Also Read : కాంగ్రెస్ శాశ్వ‌తం బీజేపీ అశాశ్వ‌తం

Leave A Reply

Your Email Id will not be published!